Shekhar Kammula Regrets Working With Nayanthara
శేఖర్ కమ్ముల అనగానే ఫీల్ గుడ్ సినిమాలు గుర్తొస్తాయి.. ఆనంద్, గోదావరి, ఫిదా, లవ్ స్టోరీ, హ్యాపీడేస్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినిమాలు అన్నీ కూడా తెలుగు ఇండస్ట్రీలో క్లాసిక్ సినిమాలు గా మిగిలిపోయినవే.
అయితే ఆయన దర్శకత్వ స్టైల్ ని మార్చి తీసిన కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. వాటిల్లో లీడర్ ఒకటైతే, మరొకటి అనామిక. వీటిల్లో లీడర్ సినిమా విజయం సాధించగా.. అనామిక మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.
ఈ క్రమంలో తాజాగా శేఖర్ కమ్ముల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన అనామిక సినిమా చెయ్యడం గురించి చెబుతూ.. తాను ఆ సినిమా చేసినందుకు చాలా రిగ్రేట్ అవుతున్నాను అని
చెప్పుకొచ్చారు.
“నేను నయనతార తో అనామిక సినిమా చేశాను. అయితే సరైన కథ లేకుండా అలాంటి లేడీ సూపర్ స్టార్ తో.. అనామిక సినిమా చేయడం నేను చేసిన పెద్ద తప్పు. ఆ సినిమా తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.. ఈ విషయం గురించి నేను ఇప్పటికే చింతిస్తున్నాను,” అని చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు..
ప్రస్తుతం శేఖర్ కమ్ములుగా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే గతంలోకి ఇంటర్వ్యూలో శేఖర్ నయనతార గురించి మాట్లాడుతూ.. ఆ హీరోయిన్ సెట్స్ లో కొంచెం పొగరుగా ఉండేది అని ఇన్ డైరెక్ట్ గా చెప్పిన విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తూ ఉన్న కుబేర చిత్రం విషయానికి వస్తే .. ఈ సినిమా జూన్ 20వ తారీఖున విడుదల కాబోతోంది. శేఖర్ కమ్ముల కెరియర్ లో ఇది మొదటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. ధనుష్, నాగార్జున హీరో దగ్గర చేస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీచర్, ట్రైలర్ మంచి అంచనాలను క్రియేట్ చేయగా.. ఈ సినిమా విజయం సాధిస్తుంది అని తెగ నమ్మకంతో ఉన్నారు ఈ డైరెక్టర్.
Also Read : అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..
Also Read : ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే ఏకైక శాండల్‌వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook