Shiva song viral: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి విడుదలైన ‘శివా శివా శంకరా’ పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట శివభక్తుల మనసుల్ని గెలుచుకుంటూ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మహా శివరాత్రిని దృష్టిలో ఉంచుకుని విడుదలైన ఈ పాటకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. యూట్యూబ్‌లోనే కాకుండా, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ పాట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ పాట విడుదలైన కొద్ది రోజులలోనే 80 మిలియన్ల (8 కోట్ల) వ్యూస్‌ను దాటేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటతో 2 లక్షలకు పైగా రీల్స్ క్రియేట్ చేయడం విశేషం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ పాటకు రీల్స్ చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. అంతేకాదు, భక్తి పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పాట శివుని మహిమను ప్రతిబింబిస్తూ ఉన్నందున వినియోగదారులు దీన్ని ఎంతో ఇష్టపడుతున్నారు.
ఈ పాట విడుదలైనప్పటి నుంచి శివ భక్తులు దీన్ని భక్తి గీతంగా స్వీకరించారు. మహాశివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పాట మరింత ట్రెండ్ అవుతోంది. ఆలయాలు, శివరాత్రి వేడుకలు, భక్తి ప్రదర్శనల్లో ‘శివా శివా శంకరా’ పాట మార్మోగిపోతోంది. సోషల్ మీడియాలోనూ శివ నామస్మరణే వినిపిస్తోంది.
ఈ పాటకు వస్తున్న అద్భుతమైన స్పందన గురించి నటుడు-నిర్మాత విష్ణు మంచు మాట్లాడుతూ, “శివా శివా శంకరా పాటకు వచ్చిన ఆదరణను చూసి చాలా సంతోషంగా ఉంది. భక్తులు రీల్స్ రూపంలో తమ భక్తిని ప్రదర్శించడం ఆనందంగా ఉంది. మేం ఊహించని రీతిలో ఈ పాట ట్రెండ్ అవుతోంది. శివరాత్రికి మరింత పాపులర్ అవుతుందని ఖచ్చితంగా అనిపిస్తోంది” అని తెలిపారు.
ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. కన్నప్ప పురాణ గాథను ఆధునిక విజువల్స్, అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తుండగా, ప్రభాస్ రుద్రుడిగా, అక్షయ్ కుమార్ మహా శివుడిగా కనిపించబోతున్నారు. అలాగే, మోహన్ బాబు, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ పాట ఇప్పటికే భక్తుల మనసును గెలుచుకుని, శివరాత్రి సందర్భంగా మరింత ప్రాచుర్యం పొందుతోంది. ‘శివా శివా శంకరా’ పాట శివుని మహిమను తెలియజేస్తూ, అందరి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంది.
Also Read: MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆశావహులు ఎవరు
Also Read: Prabhas: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. రాజా సాబ్ మూవీ కంటే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









