Tamanna Bhatia: హీరోయిన్ తమన్నాకు భారీ షాక్.. వివాదంలో 'ఓదెల -2 సినిమా

Shock To Tamanna Bhatia Her Movie Odela 2: మంచి టాక్‌తో తమన్నా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఓదెల 2 సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుండగా ఆ సినిమా తాజాగా వివాదంలో చిక్కుకుంది. సినిమాపై పోలీసులతోపాటు బీసీ కమిషన్‌కు ఫిర్యాదు వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 25, 2025, 08:43 PM IST
Tamanna Bhatia: హీరోయిన్ తమన్నాకు భారీ షాక్.. వివాదంలో 'ఓదెల -2 సినిమా

Odela 2 Controvesary: హీరోయిన్‌ తమన్నా భాటియాకు షాక్‌ తగిలింది. ఆమె నటించిన ఓదెల 2 సినిమా వివాదంలో చిక్కుకుంది. దర్శక, నిర్మాతలు క్షమాపణ చెప్పాలని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. సినిమాలో అభ్యంతకరంగా డైలాగ్‌లు ఉన్నాయని ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సినిమాలోని డైలాగ్‌లు తొలగించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆ అంశంపై పోలీసులతోపాటు బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Add Zee News as a Preferred Source

Also Read: Liquor Adulterated: వీళ్లకేం పోయేకాలం.. ఖరీదైన లిక్కర్‌లో చీప్‌ లిక్కర్‌ మిక్సింగ్‌

ఓదెల-2 సినిమాలో డైలాగ్‌లు అభ్యంతకరంగా ఉన్నాయని నవోదయ పార్టీ అధ్యక్షుడు, వంశరాజ్ కులస్తులు శివశంకర్ పటేల్ డిమాండ్ చేశారు. సినిమా దర్శక, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ కులాన్ని ఉద్దేశించి కించపరిచేలా డైలాగులు రాశారని ఆరోపించారు. ఓదెల-2 సినిమా దర్శక, నిర్మాతలు అశోక్ తేజ, డి మధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే చిత్రబృందంపై కఠిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

Also Read: Dual Marriage: ఇదేం సాంప్రదాయం..? ఒకే మండపంలో ఇద్దరమ్మాయిలతో యువకుడి పెళ్లి

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో శివశంకర్‌ పటేల్‌ మాట్లాడారు. బీసీ-ఏ సీరియల్ నెం.18లో రెడ్లకు ఆశ్రతకులమైన వంశరాజ్ కులాన్ని సినిమాలో ఒక తిట్టుగా వాడారని ఆయన ఆరోపించారు. ఆ డైలాగ్‌లతో వంశరాజ్‌ కులస్తుల మనోభావాలు దెబ్బతీశారని వివరించారు. సినిమాలోని డైలాగ్‌ల విషయమై బీసీ కమిషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సినిమాలో అభ్యంతకర డైలాగ్‌పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు శివశంకర్‌ పటేల్‌ వెల్లడించారు. తమ కులాన్ని కించపరిచి సమాజంలో విలువ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని తమ హక్కులకు భంగం కలగకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. 

ఓదెల రైల్వేస్టేషన్‌కు సీక్వెల్‌ ఓదెల 2 సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. హర్రర్‌ థ్రిలర్‌ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో తమన్నా కీలక పాత్ర పోషించారు. థియేటర్‌లో సందడి చేసిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News