Vijay Devarakonda Accident: సంతోషంగా.. ఆనందంలో ఉన్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన ప్రియురాలు, హీరోయిన్ రష్మిక మందన్నాను నిశ్చితార్థం చేసుకున్న కొన్ని రోజులకే రోడ్డు ప్రమాదానికి గురవడం కలకలం రేపింది. అయితే ప్రమాదం నుంచి విజయ్ తృటిలో తప్పించుకున్నాడు. ఎవరికీ ఏమీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సినీ పరిశ్రమకు షాకింగ్ గురి చేసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Jubilee Hills: తెలంగాణలో బిగ్ అప్డేట్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
నిశ్చితార్థం చేసుకున్న సందర్భంగా సినీ నటుడు విజయ్ దేవరకొండ ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి స్నేహితులతో కలిసి వెళ్లారు. తిరిగి హైదరాబాద్ వస్తున్నసమయంలో తెలంగాణలోని గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం 44వ జాతీయ రహదారి వరసిద్ధి వినాయక పత్తి మిల్లు వద్ద అకస్మాత్తుగా వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ప్రమాదం ఎలా జరిగిందనేది రెండు విషయాలు తెలుస్తున్నాయి. ఏపీలోని నందికొట్కూరు నుంచి పెబ్బేరుకు పశువులను తీసుకొని వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో బొలెరో వాహనాన్ని విజయ్ దేవరకొండ వాహనం ఢీకొట్టిందని చెబుతున్నారు. మరో కారణమేమిటంటే ఉండవల్లి వద్ద బొలేరో వాహనం ఒక్కసారిగా కుడివైపు టర్న్ చేయడంతో వెనుకే వస్తున్న విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురయ్యిందని చెబుతున్నారు. ప్రస్తుతానికి అసలు కారణం తెలియలేదు.
Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. 10వ తేదీన డీఏ ప్రకటించే ఛాన్స్?
ప్రమాదం అనంతరం కారును అక్కడే వదిలేసి తన స్నేహితుడి కారులో విజయ్ దేవరకొండ హైదరాబాద్‌కు వెళ్లారు. పుట్టపర్తికి మేనేజర్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ అందే శ్రీకాంత్‌తో కలిసి విజయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై విజయ్ కారు డ్రైవర్ అందే శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: DA Hike: ఎవరికి ఎంత పెంపు ఉంటుంది? డీఏ గురించి టాప్ 10 హైలెట్స్ ఇవే!
కొన్ని రోజుల కిందటనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. వివాహం చేసుకునే సమయంలో ప్రమాదాన్ని ఎదుర్కోవడంతో విజయ్, రష్మిక కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. పెళ్లికి ముందు ఇలాంటి సంఘటన చేయడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. విజయ్‌కు గండం పొంచి ఉందా? అని చర్చ జరుగుతోంది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల భారీ నిర్ణయం.. పెండింగ్ బిల్లుల కోసం నేడు భారీ ఉద్యమం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









