)
Shraddha Kapoor Surpasses PM Modi: ప్రస్తుతం, సినీ తారల ఇమేజ్ను వారి సోషల్ మీడియా ఫాలోవర్ల ఆధారంగా లెక్కిస్తున్నారు. సినిమాలు హిట్ అయినా కాకపోయినా, సోషల్ మీడియా ఫాలోవర్లు వారిని స్టార్లుగా వెలుగొందుతున్నారు. ప్రధానంగా వారికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే, వారి ఇమేజ్ పెరుగుతుంది. అది హీరో అయినా, హీరోయిన్ అయినా, ఎంత మంది వారిని ఫాలో అవుతున్నారనేది ముఖ్యం. గతంలో స్టార్లు, అభిమానుల మధ్య సినిమా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఇద్దరి మధ్య వారధిగా మారింది. అభిమానులతో లైవ్ చాట్లు, ఇంటర్వ్యూలు, సెలబ్రిటీల వ్యక్తిగత ఫోటోలతో సెలబ్రిటీలు సామాన్యులకు దగ్గరయ్యారు. ఈ ప్రక్రియలో వారి ఫాలోవర్ల పరంగా పోటీ కూడా పెరిగింది. ప్రస్తుతం భారతీయ తారలలో ఏ సినీ సెలబ్రిటీకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారో మీకు తెలుసా?
ప్రస్తుతం స్టార్ సెలబ్రిటీల స్టార్‌డమ్‌ను కొలవడానికి సోషల్ మీడియా ఒక ప్రమాణం. వారు ఎంత ప్రజాదరణ పొందారో సోషల్ మీడియా ద్వారానే తెలుస్తుంది. మరీ ముఖ్యంగా, హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు. వారు ఎప్పటికప్పుడు తమ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తారు. దీనివల్ల వారి ఫాలోవర్ల సంఖ్య పెరుగుతుంది. సినిమాలతో పాటు ఇన్స్టాగ్రామ్ స్టార్ సెలబ్రిటీలకు ఆదాయ వనరు. దీనితో పాటు, సెలబ్రిటీ హీరోయిన్లు కూడా తమ ఫాలోవర్లను పెంచుకోవడానికి పోటీ పడుతున్నారు. వారు వివిధ ఫోటోషూట్లు, విభిన్న అంశాలతో తమ అభిమానులను, సాధారణ నెటిజన్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నటీమణులు ఎక్కువ మంది ఫాలోవర్లను పొందుతున్నారు. భారతీయ సినీ తారలలో శ్రద్ధా కపూర్ అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న నటిగా రికార్డు సృష్టించింది. భారతదేశంలో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న నటిగా ఆమె ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం, శ్రద్ధా కపూర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 9.36 కోట్ల మంది అనుసరిస్తున్నారు. దీనితో ఆమె భారతదేశంలో రెండవ అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా నిలిచింది.
తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫాలోవర్స్ కంటే ఎక్కువమందిని ఫాలోవర్స్ పొంది నటి శ్రద్ధా కపూర్ రికార్డు సాధించింది. అయితే ఈ రికార్డును కొన్ని రోజుల్లోనే ప్రధాని మోదీ అధిగమించారు. ప్రస్తుతం ఆయన ఫాలోవర్స్ సంఖ్య 97.5 మిలియన్లుగా ఉంది. అంటే 9 కోట్ల 75 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే మొదటి స్థానంలో టీమ్ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తొలి స్థానంలో నిలిచారు. అయన ఫాలోవర్స్ వర్స్ సంఖ్య 278 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపుగా 28 కోట్లమంది ఫాలో అవుతున్నారు.
దేశంలో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల జాబితాలో టీం ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయనకు 27 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కోహ్లీ తర్వాత మోడీ ఇప్పుడు రెండవ స్థానంలో ఉండగా, శ్రద్ధా మూడో స్థానంలో చేరారు. ఆ తర్వాతి స్థానంలో మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు 92 మిలియన్లు, అంటే దాదాపు 9 కోట్ల 20 లక్షల మంది. ఆ తర్వాతి స్థానంలో అలియా భట్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 8 కోట్ల 50 లక్షల ఫాలోవర్లతో అలియా భట్ మూడవ స్థానంలో ఉంది. దీపికా పదుకొనే 8 కోట్ల 20 లక్షలతో నాల్గవ స్థానంలో ఉండగా, కత్రినా కైఫ్ 8 కోట్ల 10 లక్షలతో ఐదవ స్థానంలో ఉంది.
మొత్తం మీద, టాప్ 10 ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో ఎక్కువ భాగం సినిమా పరిశ్రమకు చెందిన నటీమణులతో నిండి ఉన్నాయి. టాప్ 10లో ఏ హీరో కూడా చోటు దక్కించుకోలేదనేది గమనించదగ్గ విషయం. ఈ గణాంకాల ప్రకారం, శ్రద్ధా కపూర్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ నటి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆమెకు ఉన్న అపారమైన ప్రజాదరణ కారణంగా ఆమె క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook