Shraddha Kapoor’s wedding : పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్రద్ధాకపూర్

శ్రద్ధాకపూర్ పెళ్లి వార్త బాలీవుడ్ మీడియా వర్గాల్లో ఎప్పుడూ ఓ హాట్ టాపికే. ముఖ్యంగా అమ్మడి పెళ్లి గురించి ఇటీవల జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. సాహో సినిమా పూర్తి కాగానే శ్రద్ధాకపూర్‌కి ఆమె బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్టతో పెళ్లి అవుతుందని ఒకసారి ప్రచారం జరిగితే.. 2019 చివర్లో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందంటూ ఇంకోసారి ప్రచారం జరిగింది.

Updated: Jan 24, 2020, 08:18 PM IST
Shraddha Kapoor’s wedding : పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్రద్ధాకపూర్

శ్రద్ధాకపూర్ పెళ్లి వార్త బాలీవుడ్ మీడియా వర్గాల్లో ఎప్పుడూ ఓ హాట్ టాపికే. ముఖ్యంగా అమ్మడి పెళ్లి గురించి ఇటీవల జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. సాహో సినిమా పూర్తి కాగానే శ్రద్ధాకపూర్‌కి ఆమె బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్టతో (Shraddha Kapoor’s marriage) పెళ్లి అవుతుందని ఒకసారి ప్రచారం జరిగితే.. 2019 చివర్లో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందంటూ ఇంకోసారి ప్రచారం జరిగింది. శ్రద్ధాకపూర్‌ ఈ రెండు సందర్భాలను దాటుకుని వచ్చేసినప్పటికీ.. పెళ్లి పుకార్లు మాత్రం ఆమెను విడిచిపెట్టడం లేదు. ఇదిలావుండగా శ్రద్ధాకపూర్ నటించిన స్ట్రీట్ డ్యాన్సర్ 3D మూవీ (Street Dancer 3D movie) రేపే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మరోసారి శ్రద్ధాకపూర్ పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో తన అప్‌కమింగ్ మూవీ స్ట్రీట్ డ్యాన్సర్ 3D ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న శ్రద్దాకు ఇక తన పెళ్లి వార్తలపై స్పందించక తప్పలేదు.

అవును, తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లిపై స్పందించిన శ్రద్ధాకపూర్.. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్‌పైనే ఉందని.. మరో రెండు, మూడేళ్ల వరకు పెళ్లి ప్రస్తావనే లేదని స్పష్టంచేసింది. శ్రద్ధా పెళ్లిపై క్లారిటీ వచ్చింది కనుక ఇకనైనా ఆమె పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడుతుందేమో చూడాలి మరి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..