)
Shwetha Menon Obscene Content: ప్రముఖ మలయాళ హీరోయిన్ శ్వేతా మీనన్ పై కేసు నమోదయింది. డబ్బు కోసం అశ్లీల చిత్రాల్లో నటించడమే అందుకు కారణంగా కనిపిస్తుంది. శ్వేతా మీనన్ పై కొచ్చి సెంట్రల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు అయింది. సోషల్ మీడియాలో నగ్న, అశ్లీల వీడియోలు ప్రసారం చేసిందని నటి శ్వేతా మీనన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్టిన్ మొనచేరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఐటి చట్టంలోని సెక్షన్ 67 ఏ ప్రకారం అశ్లీల కార్యకలాపాల నిషేధ చట్టం కింద ఈ కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు
శ్వేతా మేనన్ మనకు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే 'రతినిర్వేదం' అనే డబ్బింగ్ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. నటి శ్వేతా మీనన్ నటించిన చిత్రాల్లో అశ్లీల దృశ్యాలు ఉన్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి. ఆమె గతంలో నటించిన 'రతినిర్వేదం', 'పలేరీ మాణిక్యం', 'శ్వేత' వంటి చిత్రాలు గర్భనిరోధక ప్రకటనలు ఇచ్చినట్లు వంటి వాటిపై ఫిర్యాదులు అందాయి.
అయితే మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (అమ్మ) అధ్యక్ష పదవికి నటి శ్వేతా మీనన్ పోటీ చేస్తుంది. ఈ క్రమంలో ఆమెపై కేసు నమోదు అవ్వటం ఇప్పుడు మాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన సినిమాలపై ఇప్పుడు కేసు నమోదు అవ్వటం కొంచెం అనుమానస్పదంగానే ఉంది.
మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్నికల హడావిడి మొదలైంది. మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (అమ్మ) అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల నుంచి జగదీష్ తప్పుకున్నారు. దీంతో నటి శ్వేతా మీనన్ ప్రధాన పోటీదారుగా కనిపిస్తోంది. ఈమెతో మరొకరు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ ఎన్నికకు ఓటింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు విడుదల కానున్నాయి. గతంలో మూడు పర్యాయాలుగా సూపర్ స్టార్ మోహన్ లాల్ అధ్యక్షుడిగా కొనసాగారు. మోహన్ లాల్ ఆ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆ పదవికి పోటీ మరింత తీవ్రమైంది. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవితో పాటు సభ్యుల ఎన్నిక కూడా జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook