)
Shweta Menon Pregnant Movie: సినిమాల్లో పనిచేసే నటులు తమ సినిమాలతో పాటు వివాదాస్పద ప్రకటనలతో తరచుగా వార్తల్లో నిలుస్తారు. సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో పనిచేసిన ఓ స్టార్ హీరోయిన్.. ఓ సినిమా కోసం నిజంగానే గర్భం తెచ్చుకుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఏ సినిమా కోసం ఈ పని చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ నటి శ్వేతా మీనన్.. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి పెద్ద నటులతో తెరపై కలిసి నటించింది. ప్రముఖ మోడల్ అయిన ఆమె 1997లో 'పృథ్వీ' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శ్వేతా 'ఇష్క్', 'బంధన్', 'షికారి', 'అశోక', 'హాన్ మై భీ ప్యార్ కియా', 'అబ్‌కే బరాస్', 'మక్బూల్', 'హంగామా', 'ఓంకార', 'రన్', 'శిఖర్' వంటి చిత్రాల్లో నటించింది. ఆమె బాలీవుడ్‌తో సహా అనేక మలయాళ భాషా చిత్రాలలో నటించింది. తెలుగులో 'రతినిర్వేదం' డబ్ సినిమాతో తెలుగువాళ్లకు పరిచయమే. కానీ, ఓ మలయాళ చిత్రం కోసం శ్వేతా మీనన్ ఏకంగా గర్భం తెచ్చుకుందట. కెమెరా ముందే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ విషయమై అనేక సార్లు ఈమె వార్తల్లో నిలిచింది.
2013లో రభిణి అనే మహిళ జీవితం ఆధారంగా తీసిన బయోపిక్ 'కలిమన్ను'లో ఒక సన్నివేశం కోసం శ్వేతా మీనన్ గర్భవతి. ఆ సమయంలో శ్వేత ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవానికి ముందు, దర్శకుడు ఆపరేషన్ థియేటర్లో మూడు కెమెరాలను ఏర్పాటు చేసి, శ్వేత ప్రసవానికి సంబంధించిన 45 నిమిషాల సన్నివేశాన్ని చిత్రీకరించాడు.
తరువాత 'కలిమన్ను' సినిమా పెద్ద హిట్ అయింది. కానీ మరోవైపు, ఈ సినిమాపై విస్తృత వ్యతిరేకత వచ్చింది. సినిమాలోని ఒక సన్నివేశంలో డెలివరీ సన్నివేశాన్ని చూపించడం అనైతికమని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి...
శ్వేతా మీనన్ ఎవరు?
శ్వేతా మీనన్ 1974 ఏప్రిల్ 23న చండీగఢ్‌లో జన్మించారు. ఆమె మలయాళ చిత్రాలతో తన కెరీర్‌ను ప్రారంభించింది. సునీల్ శెట్టి 'పృథ్వీ' చిత్రంతో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు 30కి పైగా హిందీ చిత్రాల్లో నటించిన శ్వేత, మొదట బాబీ భోంస్లేను వివాహం చేసుకుంది. కానీ వారి సంబంధం 2007లో తెగిపోయింది.
ఇటీవలే మలయాళ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన నటి శ్వేతా మీనన్.. డబ్బు కోసం అశ్లీల చిత్రాల్లో నటించదనే ఆరోపణలను ఎదుర్కొంది. అందుకుగానూ, ఈమెపై గతంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈమె ఇండస్ట్రీలో గడిచిన చాలా ఏళ్లు ఈమె అనేక వివాదాల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook