Jack Trailer Talk: ‘జాక్’ ట్రైలర్ టాక్.. సిద్దు జొన్నలగడ్డ మరో కామెడీ థ్రిల్లర్..

Jack Trailer Talk Review: తెలుగులో డీజే టిల్లు  మూవీతో తన కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఆ తర్వాత ‘టిల్లు స్క్వేర్’ మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఇపుడు ‘జాక్’ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 3, 2025, 01:05 PM IST
Jack Trailer Talk: ‘జాక్’ ట్రైలర్ టాక్.. సిద్దు జొన్నలగడ్డ మరో కామెడీ థ్రిల్లర్..

Jack Trailer Talk Review:  సిద్దు జొన్నలగడ్డ వరుస చిత్రాలతో అలరిస్తున్నాడు. టిల్లు బ్రాండ్ తో హైదరాబాద్ పోరడిగా చేసిన కామెడీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజాగా ఇపుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో  ‘జాక్’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ మూవీకి కొంచెం క్రాక్ అనేది ఉప శీర్షిక. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం కామెడీతో ఉంది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. జాక్ ఓ స్పై గా నటిస్తున్నట్టు చూపించాడు. తన గూఢచర్యం కోసం రకరకాల వేషాలు వేస్తుంటాడు. అది ఈ ట్రైలర్ లో చూపించాడు.

Add Zee News as a Preferred Source

మన దేశంలో నాలుగు చోట్ల టెర్రరిస్టులు బాంబులు పెట్టారనే ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలో హీరో తన టీమ్ తో కలిసి ఎలాంటి ఆపరేషన్ చేసి దేశ ద్రోహుల ఆట కట్టించాడనేడనేదే ఈ సినిమా స్టోరీలా కనిపిస్తోంది. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తన మార్క్ ను దాటి హాస్యంతో పూర్తి ఎంటర్టేనర్ గా తెరకెక్కించాడు.

సిద్దు జొన్నలగడ్డ మరోసారి తన మార్క్ నటనతో ఫుల్ జోష్ తో ఉంది. ట్రైలర్ లో చూపించినట్టే కథ ఉంటే..సిద్దు ఖాతాలో మరో  బ్లాక్ బస్టర్ పడినట్టే చెప్పాలి. యాక్షన్ ప్లస్ కామెడీతో పాటు హీరోయిన్ వైష్ణవి చైతన్యతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. మొత్తంగా ‘జాక్’ తో మరో హిట్ అందుకొని హీరోగా హాట్రిక్ నమోదు చేస్తాడా లేదా అనేది చూడాలి.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News