Sikandar collections: సల్మాన్ మార్కెట్ డౌన్ ఫాల్.. సికందర్ కి షాకింగ్ ఓపెనింగ్స్..

Sikandar collections: ఎంత పెద్ద స్టార్ హీరోకు అయినా.. ఏదో ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. అలా ఒకప్పుడు బాలీవుడ్ ను శాసించిన సల్మాన్ ఖాన్.. గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ సక్సెస్ ను అందుకోలేకపోతున్నాడు. అంతేకాదు బీభత్సమైన కలెక్షన్స్ ను మునుపటిలా అందుకోలేక చతికిల బడుతున్నాడు.  తాజాగా ఉగాది రోజున ఈద్ సందర్భంగా విడుదలై ‘సికందర్’ మూవీకి ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ నిదర్శనం అంటున్నారు ట్రేడ్ పండితులు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 31, 2025, 03:30 PM IST
Sikandar collections: సల్మాన్ మార్కెట్ డౌన్ ఫాల్.. సికందర్ కి  షాకింగ్ ఓపెనింగ్స్..

Sikandar collections: సల్మాన్ ఖాన్ సినిమాలు..బాగున్నా.. లేకపోయినా.. బాక్సాఫీస్ దగ్గర కాసులు గలగల లాడాల్సిందే. అతని ఫ్లాప్ సినిమాలు కూడా వందల కోట్లు వసూల్లు చేసిన సందర్బాలు ఎన్నో. ఇవన్నీ గతం తాజాగా సల్మాన్ ఖాన్ పరిస్థితి ఒకప్పటిలా లేదు. ఎపుడో పదేళ్ల క్రితం ఏక్ థా టైగర్, సుల్తాన్ వంటి సినిమాలు మన దేశంలో  బాక్సాఫీస్ దగ్గర రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. కానీ సల్మాన్ ఖాన్ తాజాగా చిత్రం ‘సికిందర్’ మూవీకి ఎపుడో పదేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ సినిమాలకు ఫస్ట్ డే వచ్చిన ఓపెనింగ్సే వచ్చాయి. మురుగదాస్ వంటి టాప్ సౌత్ దర్శకుడుతో సల్మాన్ ఖాన్ నటించిన ‘సికందర్’ మూవీ రొటీన్ మాస్ మూవీ కావడంతో ఈ సినిమాకు పెద్దగా ఓపెనింగ్స్ మాత్రం రాలేదు. ఓవరాల్ గా తిప్పి  కొడితే.. రూ. 30.06 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.

Add Zee News as a Preferred Source

ఈ సినిమా మన దేశంలో 5500 స్క్రీన్స్ లో 22000 షోలు మన దేశంలో ప్రదర్శించబడ్డాయి. అయినా.. గతంతో పోల్చుకుంటే టికెట్ రేట్స్ భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ స్టార్ డమ్ తగ్గిందా అంటే లెక్కలు చూస్తుంటే తగ్గిందనే చెప్పాలి. ఒకప్పటిలా సల్మాన్ ఖాన్ కు ఉన్న ఇమేజ్ పూర్తిగా తగ్గిందనే చెప్పాలి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ గత కొన్నేళ్లుగా రొటీన్ మాస్ మసాలా సినిమాలే చేస్తున్నారు. డిఫరెంట్ స్టోరీలు ఆయన్నుంచి ఆశించకూడు. ప్రేక్షకులు కూడా ఆయన్నుంచి యాక్షన్ సినిమాలే కోరుకుంటున్నారు. కాబట్టి సల్లూ కూడా అలాంటి తరహా చిత్రాలే చేస్తున్నాడు.

 

సల్మాన్ ఒక్కడే రొటీన్ సినిమాలు చేస్తున్నాడు అని కాదు. మన దేశంలో  మెజారిటీ హీరోలు కూడా రొటీన్ సినిమాలే చేస్తున్నారు. మిగతా బీటౌన్ హీరోలతో పోలిస్తే.. ఈ కలెక్షన్స్ ఎక్కువనే చెప్పాలి. కానీ రాను రాను రొటీన్ సినిమాలు చేసుకుంటూ పోతే.. సల్మాన్ ఖాన్ మార్కెట్ డౌన్ ఫాల్ కావడమే తప్ప మరేది లేదు. సల్మాన్ అనే కాదు.. రొటీన్ సినిమాలు చేసే ప్రతి ఒక్క హీరో కూడా ఒక తరహా చిత్రాలు చేసుకుంటూ తమను తాము అప్ డేట్ చేసుకోకుంటే అంతే సంగతులు. ఈ విషయంలో సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రాల ఎంపికలో జాగ్రత్త పడతాడేమో చూడాలి.

ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!

ఇదీ చదవండి:  Jaya Prada Husband: నటి జయప్రద పెళ్లై ముగ్గురు పిల్లల తండ్రిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. షాకింగ్ నిజాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News