Sikandar 2 Days Collections: సల్మాన్ ఖాన్ స్టార్ ఇమేజ్ కు ఎక్స్ పైరీ డేట్ వచ్చేసింది. ఇలా సల్లూ భాయ్ స్లంప్ లో ఉన్నపుడుల్లా వినిపించి మాట. కానీ అలా చతికిలబడ్డ ప్రతీసారీ గోడకు కొట్టిన బంతిలా బ్యాక్ బౌన్స్ అయ్యాడు. కానీ గత కొన్నేళ్లుగా సల్మాన్ ఖాన్ పరిస్థితి చూస్తుంటే.. తిరిగి కోలుకోవడం కష్టమే అని చెబుతున్నారు ట్రేడ్ పండితులు. పైగా ఏజ్ కూడా 60కి దగ్గర పడ్డాడు. ఈయనకు పోటీగా ఇపుడు యూత్ లో కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్ వంటి హీరోలు రేసులో ముందున్నారు.
ఆ సంగతి పక్కనపెడితే.. సల్మాన్ ఖాన్... తాజాగా దక్షిణాది దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో చేసిన ‘సికందర్’ మూవీ ఏ కోశానా సామాన్య ప్రేక్షకులతో పాటు అభిమానులను మెప్పించలేకపోయింది. పైగా ఈ సినిమా రిలీజ్ రోజే.. పైరసీ హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లో లీకవ్వడం ఈ సినిమాకు పెద్ద దెబ్బఅని చెప్పాలి. పైగా ఈ మధ్యకాలంలో ఆడియన్స్ కూడా ఏదైనా గ్రాఫిక్స్ కు సంబంధించిన చిత్రాలైతేనే బిగ్ స్క్రీన్ పై చూస్తున్నారు. మిగతా సినిమాలకు కాస్త టాక్ తేడా కొట్టినా.. అసలు పట్టించుకోవడం లేదు.
తాజాగా విడుదలై సల్మాన్ ఖాన్ సికందర్ మూవీ పెద్దగా స్టోరీ లేదు. పైగా మొదటి రోజే ..ఈ సినిమాకు మన దేశంలో రూ. 30 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజు ఈద్ పండగ నేపథ్యంలో ఏమైనా కలెక్షన్స్ పెరుగుతాయనుకుంటే.. కొద్దిలో కొద్దిగా కాస్త నయం. ఈ రోజు రూ. 33.36 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో అది కూడా సెలవు రోజుల్లో ఈ సినిమా రూ. 63.42 కోట్ల నెట్ వసూళ్ల ను రాబట్టింది. రీసెంట్ టైమ్ లో అంతగా ఫామ్ లో లేని సల్మాన్ ఖాన్ కు ‘సికందర్’ మూవీ మంచి కమ్ బ్యాక్ ఇస్తుందనుకొంటే.. ఈ సినిమా మొదటి రోజే చేతులేత్తేసింది. మొత్తంగా సల్మాన్ ఖాన్ కెరీర్ లో ‘సికిందర్’ మూవీ పెద్ద డిజాస్టర్ గా నిలిచిపోతుందా లేదా అనేది చూడాలి. ఈ రోజు నుంచి ఈ చిత్రానికి అతిపెద్ద పరీక్ష. నెక్ట్స్ వీకెండ్ వరకు ఈ సినిమా ఎలాంటి హోల్డ్ చూపిస్తుందో దాన్ని బట్టి ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది. ఇప్పటికే ఈ సినిమాను కొన్న బయ్యర్స్ నిండా మునగడం ఖాయం అనే ముచ్చట వినిపిస్తోంది. మొత్తంగా సల్మాన్ ఖాన్ కు ‘సికందర్’ తో దెబ్బ మీద దెబ్బ తగిలబోతుందనే చెప్పాలి.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









