Simbu Father Rajender Hospitalised: కోలీవుడ్ నటుడు, దర్శకుడు టి.రాజేందర్ (67) ఛాతి నొప్పితో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మెరుగైన వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను విదేశాలకు తరలించే యోచనలో ఉన్నారు. హీరో, రాజేందర్ తనయుడు శింబు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'మా నాన్న రాజేందర్‌‌కు ఛాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో చేర్చాం. ఆయన కడుపులో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయన్ను విదేశాలకు తీసుకెళ్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.' అని శింబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 


రాజేందర్‌ను ఓ ప్రైవేట్ జెట్‌లో అమెరికాకు తరలించనున్నట్లు తెలుస్తోంది. రాజేందర్ ఆరోగ్యంపై ఆయన భార్య ఉష మీడియాతో మాట్లాడుతూ అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నారని... ఆహారం తీసుకుంటున్నారని చెప్పారు. ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుతున్నారని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని శింబు భావించడంతో ఆయన్ను విదేశాలకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే వీసా కూడా వచ్చిందని రెండు రోజుల్లో విదేశాలకు వెళ్తామని చెప్పారు.


విదేశాల్లో అయితేనే రాజేందర్‌కు కాస్త ప్రైవసీ కూడా దొరుకుతుందని ఉష పేర్కొన్నారు. చెన్నైలో అయితే ఆయన చుట్టూ ఎప్పుడూ 15 మంది వరకు ఉంటూనే ఉంటారని అన్నారు. వాళ్లెవరినీ కాదనలేం కాబట్టి.. అమెరికాలో అయితే ఆయనకు తగినంత ప్రైవసీ ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా.. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తమిళ సినిమాపై రాజేందర్ తనదైన ముద్ర వేశారు. 1980ల్లో ఆయన ఎన్నో హిట్ చిత్రాలు అందించారు. రాజేందర్‌కు భార్య ఉష, ముగ్గురు పిల్లలు ఉన్నారు.



Also Read: డుప్లెసిస్ ఆర్‌సీబీ తలరాతను మార్చాడు.. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే..! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెహ్వాగ్‌


Also Read: IPL 2022 Qualifier 1 GT vs RR: వరణుడిపైనే రాజస్థాన్ భవితవ్యం.. అదే జరిగితే ఐపీఎల్ 2022 ఫైనల్లోకి గుజరాత్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook