Singer Pravasthi: ప్రవస్తి వివాదంపై సింగర్ గీతా మాధురి స్పందన..

Singer Pravasthi: గాయని  ప్రవస్తి వివాదం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఆమె చెప్పిన దానికి కొంత మంది ఏకీభవిస్తే.. మరికొందరు ఇదంత నేమ్ కోసం ఫేమ్ కోసం ఆమె చేస్తున్న డ్రామా అంటున్నారు. ఏది ఏమైనా లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పటికే ఎలాంటి సమాధానాలు లేవు. తాజాగా సింగర్ ప్రవస్తి ఉందతంపై సింగర్ గీతా మాధురి స్పందించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 29, 2025, 06:50 AM IST
Singer Pravasthi: ప్రవస్తి వివాదంపై సింగర్ గీతా మాధురి స్పందన..

Singer Pravasthi: అవును ప్రస్తుతం సింగింగ్ టాలెంట్ షోలో కొంత మంది టాలెంట్ ఉన్న వాళ్లను తొక్కేస్తున్నారనే అంశం వివాదమవుతోంది. అదేదో సినిమాలో చూపించినట్టు నిజంగానే సింగింగ్ టాలెంట్ షోలో ఇంత అవినీతి కుళ్లు దాగున్నాయా అనే అంశంపై చర్చ నడుస్తుంది. ప్రవస్తి నిజంగానే బాగా పాడలేపోబట్టే ఆమెను ఎలిమినేట్ చేసారని కొందరు సమర్థిస్తుంటే.. కాదు.. కాదు ఆమెకు కావాలనే ఎక్కితొక్కాలనే ఉద్దేశ్యంతో ఆమెను ఈ షోను ఎలిమిటనేట్ చేసారనేది ఎక్కువ మంది చెబుతున్నది.

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం సింగర్ ప్రవస్తి అంశం మీడియాలో రచ్చగా మారింది. అయితే కొంత మంది ఇలాంటి టాలెంట్ షోలో నెంబర్ వన్ గా నిలవని వాళ్లు పెద్ద సింగర్ అయిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. తనను కావాలని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారని కూడా ప్రవస్తి పాడుతా తీయగా జడ్జీలపై ఓ రేంజ్ లో ఫైర్ అయింది. ముఖ్యంగా సింగర్ సునీతపై.. ప్రవస్తి ఒక రేంజ్ లో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ ఘటనపై ప్రముఖ సింగర్ గీతా మాధురి స్పందించారు.

ఇండస్ట్రీలో చాలా హార్డ్ షిప్స్ ఎదురవుతాయని.. ఏ విషయం ఎంతవరకు తీసుకోవాలో తెలిసి ఉండాలని అన్నారు. ప్రతి అనుభవం సక్సెస్ కు ఒక మెట్టుగానే భావించాలన్నారు. మెంటల్ స్ట్రెస్ లో ఉండి  ప్రవస్తి స్పందించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పాడుతా తీయగా లాంటి మంచి ప్రోగ్రామ్‌లో గెస్టులపై ఆరోపణలు రావడం బాధాకరమని అన్నారు గీతామాధురి.

ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

ఇదీ చదవండి:  కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News