Singer Kalpana: వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స..

Singer Kalpana Suicide Attempt: టాలీవుడ్ గాయని కల్పన ఆత్మహత్యా యత్నం తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. అసలు ఆమె ఎందుకు ఆత్మ హత్యకు ప్రయత్నించిందనే విషయం తెలియరాలేదు. ప్రస్తుతం ఈమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 5, 2025, 08:12 AM IST
Singer Kalpana: వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స..

Singer Kalpana Suicide Attempt: ఆత్మహత్యకు యత్నించిన ప్రముఖ నేపథ్య గాయని కల్పనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. వీరిలో గాయనీ గాయకులు శ్రీకృష్ణ, సునీత, గీతామాధురి, కారుణ్య తదితరులు ఉన్నారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.

Add Zee News as a Preferred Source

హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఉంటున్న కల్పన నిన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమె ఫ్లాట్‌కు చేరుకుని తలుపులు బద్దలుకొట్టి ఆమెను కాపాడారు. అయితే, ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు తెలియరాలేదు. విషయం తెలిసి హైదరాబాద్ చేరుకున్న కల్పన భర్త ప్రసాద్‌ను పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

కల్పన రాఘవేందర్ తమిళనాడు రాజధాని చెన్నైలో పుట్టి పెరిగింది. ఈమె తెలుగు బిగ్ బాస్ సీజన్ 1లో పార్టిసిపేట్ చేసింది. ఈమె కుటుంబంలో అందరు శాస్త్రీయ సంగీత కళాకారుల కుటుంబం. దీంతో స్వతహాగా ఈమె అడుగులు దానిపైనే పడ్డాయి. ఆ తర్వాత వివిధ టాలెంట్ షోల్లో పార్టిసిపేట్ చేసి విజేతగా నిలవడంతో ఈమెకు  సినిమాల్లో సింగర్ గా అవకాశాలు తలుపు తట్టాయి. చిన్నప్పటి నుంచి సింగర్ గా ప్రాక్టీస్ చేస్తోన్న ఈమె బాలనటిగా ఒకటి రెండు చిత్రాల్లో నటించింది కూడా. 1991లో 11 యేళ్ల వయసులోనే సింగర్ గా ప్రస్థానం మొదలుపెట్టి కంటిన్యూగా పాటలు పాడుతూనే ఉంది. ఈమె తెలుగులో పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో పాటలు పాడి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News