Singer Kalpana: అందుకే చనిపోవాలనుకున్నా.. పోలీసులకు అసలు నిజం చెప్పేసిన సింగర్ కల్పన..

Singer kalpana news: సింగర్ కల్పన ప్రస్తుతం ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. డాక్లర్ల అనుమతిలో పోలీసులు సింగర్ కల్పనతో తాజాగా మాట్లాడారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 5, 2025, 01:36 PM IST
  • పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చిన సింగర్ కల్పన..
  • కూతురు వల్లే అంటూ వ్యాఖ్యలు..
Singer Kalpana: అందుకే చనిపోవాలనుకున్నా..  పోలీసులకు అసలు నిజం చెప్పేసిన సింగర్ కల్పన..

Singer kalpana case update: సింగర్ కల్పన సూసైడ్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆమె  KPHBలోని హోలిస్టిక్‌ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాయి. ఘటన జరిగిందనే విషయం తెలియగానే.. ఆమె భర్త ప్రసాద్, కూతురు హైదరబాద్ కు చేరుకున్నారు. అదే విధంగా ప్రముఖ సింగర్స్ అంతా..  కల్పనను పరామర్శించేందుకు ఆస్పత్రికి క్యూలు కట్టారు.

Add Zee News as a Preferred Source

ఇప్పటికే సింగర్ సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు అక్కడికి చేరుకొని ఆమె ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అయితే.. ప్రస్తుతం సింగర్ కల్పన ఆత్మహత్యయత్నానికి ఆమె భర్త కారణం కావచ్చని అందరు భావించారు. కానీ అందరికి షాక్ కు గురిచేసేలా కల్పన అసలు విషయంను పోలీసులకు చెప్పారు. డాక్టర్లు పర్మిషన్ తో పోలీసులు సింగర్ కల్పనతో కొద్దిసేపు మాట్లాడారు. అసలు ఆత్మహతకు ఎందుకు ప్రయత్నించారని పోలీసులు ప్రశ్నించారు. దీంతో కల్పన మెల్లగా అసలు నిజంను బైటపెట్టారు.  తన పెద్ద కూతురు కేరళలో ఉంటుందని ఆమెను హైదరబాద్ కు  వచ్చేయాలని కోరినట్లు కల్పన చెప్పారు .

కానీ తన కూతురు మాత్రం ఎన్ని చెప్పిన కూడా హైదరాబాద్ కు వచ్చేందుకు ససేమీరా అన్నారు. దీంతో తమమధ్య వాగ్వాదం జరిగిందని కల్పన పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో చెప్పింది. ఈ క్రమంలో కోపంలో తాను.. జోల్ ఫ్రెష్ అనే నిద్రమాత్రల్ని తీసుకున్నట్లు కల్పన పోలీసులకు ఇచ్చిన తాజాగా స్టేట్ మెంట్ లో వెల్లడించారు. దీంతో ఈ కేసులో ఇది బిగ్ ట్విస్ట్ గా చెప్పుకొవచ్చు.  ప్రస్తుతం సింగర్ కల్పన హెల్త్ నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News