Singer Kalpana Selfie about her health video: సింగర్ కల్పన ఇటీవల సూసైడ్ కు యత్నించారని గత రెండు రోజులుగా అనేక కథనాలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమెకు తన భర్తతో విభేదాలు వచ్చాయని అందుకే సూసైడ్ కు ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా.. మరికొందరు కేరళలో ఉంటున్న కూతురుని హైదరబాద్ కు వచ్చేయాలని సింగర్ కల్పన అడిగారని.. కానీ ఆమె ఒప్పుకోలేదని అందుకే ఈ విధంగా గొడవలు జరిగాయని.. ఒత్తిడి భరించలేక సింగర్ కల్పన ఆత్మహత్యయత్నం చేశారని అనేక వార్తలు వైరల్ అయ్యాయి.
నా భర్తతో విభేదాలు ఏమి లేవు
ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవడంతో డాక్టర్ సూచనతో మెడిసిన్ వాడుతున్నా
దాని డోస్ ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లా - సింగర్ కల్పన https://t.co/YE3joDJH1V pic.twitter.com/LjbhbhWzV4
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2025
మొత్తానికి దీనిపై ఆస్పత్రిలో కోలుకుంటున్న సింగర్ కల్పన ఒక వీడియోను విడుదల చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సింగర్ కల్పన మాట్లాడుతూ..గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తాను సూసైడ్ కు యత్నించానని అనేక కథనాలు, వార్తలు వైరల్ అయ్యాయని అన్నారు. ఇదంతా పచ్చి అబద్దమంటూ కొట్టిపారేశారు. తాను.. 45 ఏళ్ల వయసులో పీహెచ్ డీ, ఎల్ఎల్ బీ చేస్తున్నానని, దీని వల్ల తాను చాలా ఒత్తిడికి గురౌతున్నానని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని చెప్పారు.
అందుకే ఇటీవల డాక్టర్ల ఇమ్ సోమ్నియా సమస్యకు గాను.. కొన్ని నిద్ర మాత్రలు సూచించారని చెప్పింది. అయితే.. ఆ నిద్ర మాత్రలు మోతాదుకు మించివేసుకొవడం వల్ల.. తనకు ఈ విధంగా జరిగిందని చెప్పుకొచ్చారు. తన కూతురు, భర్త తగిన సమయంలో స్పందించడం వల్ల ఈవిధంగా తాను ప్రాణాలతో బైటపడ్డానని, తన భర్త ,కూతురు ప్రతిదాంట్లో తనకు సహకరిస్తున్నారని సింగర్ కల్పన చెప్పింది.
తాను కోలుకోగానే.. మరల మీ ముందుకు పాట పడుతూ అందరిని అలరిస్తారని కూడా సింగర్ కల్పన చెప్పింది. తన పట్ల అభిమానం చూపిన అందరికి ఎల్లప్పుడు రుణపడి ఉంటానని కూడా సింగర్ కల్పన థైంక్స్ చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ కు సింగర్ కల్పన గట్టిగానే చెక్ పెట్టిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









