Singer Kalpana: భర్తతో కాదు.. కూతురితో గొడవలు..!.. సింగర్ కల్పన ఘటనలో వెలుగులోకి కొత్త ట్విస్ట్..?..

Singer Kalpana news: సింగర్ కల్పన ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.  దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 5, 2025, 01:00 PM IST
  • సింగర్ సూసైడ్ ఘటనలో బిగ్ ట్విస్ట్..
  • ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు..
Singer Kalpana: భర్తతో కాదు.. కూతురితో గొడవలు..!.. సింగర్ కల్పన ఘటనలో వెలుగులోకి కొత్త ట్విస్ట్..?..

Singer kalpana hospitalized latest news:  సింగర్ కల్పన సూసైడ్ అంశం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దుమారంగా మారింది. రెండు రోజుల వరకు తమతో బాగా మాట్లాడారని కేపీహెచ్ బీ అపార్ట్ మెంట్ వాసులు సైతం ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.  నిన్న అపస్మారక స్థితిలో ఉన్న సింగర్ కల్పనను పోలీసులు స్థానికంగా ఉన్నహోలిస్టిక్‌ ఆసుపత్రిలో తీసుకెళ్లారు. ఆమెకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

 సింగర్ కల్పన నిన్న.. జోల్ ఫ్రెష్ అనే నిద్ర మాత్రల్ని వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే..  కల్పనకు ఆమె భర్త ప్రసాద్ మంగళవారం  ఫోన్ చేశారని కల్పన పోన్ తీయకపోవడంతో వెంటనే అపార్ట్ మెంట్ సెక్యురిటీకా కాల్ చేశారు. దీంతో అపార్ట్ మెంట్ వాసులు కల్పన ఉంటున్న ఇంటి డోర్ బెల్ కొట్టిన ఆమె తీయలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు డోర్ లాక్ పగల కొట్టి బెడ్ మీద అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కల్పనకు వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి మరీ చికిత్స అందిస్తున్నారు. విషయం తెలియగానే.. కల్పన భర్త, ఆమె కూతురు హైదరబాద్ చేరుకున్నారు. అదే విధంగా ప్రముఖ సింగర్ లు.. సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు అక్కడికి చేరుకొని ఆమె ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులు కల్పన భర్తతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం. అందరు కూడా కల్పనకు.. ఆమె భర్తతో వివాదం ఉండొచ్చని అనుకున్నారు. కానీ అసలు కల్పనకు తన పెద్ద కూతురుతో వాగ్వాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కేరళలో కల్పన పెద్ద కూతురు ఉంటుంది.

Read more: Ranya Rao: ఎయిర్ పోర్ట్‌లో అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్.. బంగారంను అక్కడ పెట్టి మరీ స్మగ్లింగ్..

ఆమెను హైదరబాద్ కు వచ్చేయాలని కల్పన అడిగారంట. కానీ దీనికి కల్పన కూతురు అస్సలు అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య ఫోన్ లోనే వాగ్వాదం జరిగిందంట. దీంతో ఈ ఒత్తిడితోనే కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసి ఉంటారని కూడా ప్రచారం జరుగుతుంది.  ఇందులో ఎంత నిజముందో కానీ.. కల్పన కొలుకున్న తర్వాత అసలు విషయాలన్ని వెలుగులోకి వస్తాయని పోలీసులు చెప్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News