మధుప్రియ.. ఈ పేరు తల్చుకుంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేంది. 'ఆడపిల్లనమ్మా..' అనే పాట. ఐదవ తరగతి చదువుతున్నప్పుడే ఈ పాట పాడి చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ గాయని రీసెంట్ గా 'బిగ్ బాస్' రియాలిటీ షోతో మరింత పాపులర్ అయింది. సరిగ్గా 18 ఏళ్ళు నిండి 30 రోజులు కూడా పూర్తి కాకుండానే తను ప్రేమించిన శ్రీకాంత్ ను పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోడం, మనస్పర్ధలొచ్చి వార్తల్లోకెక్కడం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఇద్దరు సంతోషంగానే ఉన్నారు. ఇటీవల 'ఫిదా'లో 'వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే' అనే పాటతో అందరి మన్ననలు పొందింది. అంతేకాదు తెలుగు బిగ్ బాస్ షోలో తనకంటే పెద్దకంటెస్టంట్ గా చూసినప్పుడు అందరూ షాక్ అయ్యారు. తనకంటే వయసులో పెద్దవారితో పోటీ పడుతూ ఆ షోలో కొనసాగింది. కొద్దిరోజులకు మానసికంగా కుంగిపోయి బయటకు వచ్చేసింది. అయితే అలా రాకుండా ఉండాల్సింది ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. లైఫ్ లో ఎంతో డిస్టర్బ్ అయ్యానని చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అన్నది. మొత్తానికి చాలా మంది సింగర్స్ మాదిరి పాటలతో కాకుండా తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది మధుప్రియ.