Singer Pravasthi Video: సింగర్ సునీత మహా ముదురు..!.. పాడుతా తీయగా జడ్జీలపై సింగర్ ప్రవస్తి షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్..

Singer parvasthi on padutha teeyaga judges: సింగర్ ప్రవస్తి లేడీ సింగర్ పాడుత తీయగ ప్రొగ్రామ్ పై సంచలన ఆరోపణలు చేశారు. మొత్తంగా పాడుతా తీయగా జడ్జీలపై లేడీ సింగర్ చేసిన కామెంట్స్ నెట్టింట దుమారంగా మారాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 21, 2025, 06:23 PM IST
  • పాడుతా తీయగా జడ్జీలపై ఆరోపణలు..
  • సింగర్ ప్రవస్తి కామెంట్స్ వైరల్..
Singer Pravasthi Video: సింగర్ సునీత మహా ముదురు..!.. పాడుతా తీయగా జడ్జీలపై సింగర్ ప్రవస్తి షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్..

Singer Pravasthi Shocking Comments on Padutha teeyaga judges video: పాడుతా తీయగా కార్యక్రమంను గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం 1996 లో ప్రారంభించారు. ఇప్పటికి ఈ షో అంటే.. మనదేశంలోనే కాకుండా.. విదేశాల్లో కూడా ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత ఆయన కుమారుడుఎస్పీ చరణ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకి సింగర్ సునీత‌, చంద్రబోస్, కీరవాణి న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

కొన్ని సంవ‌త్స‌రాలుగా ఈ షో అప్ర‌తిహ‌తంగా సాగుతూ వ‌స్తుంది.  అయితే తాజాగా ఈ షోపై సింగర్ ప్రవస్థి సంచలన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి. ఇటీవల ప్రవస్థి పాడుతా తీయగా షోలకు వెళ్లారు.అయితే.. అక్కడ అనూహ్యంగా ఆమెను ఎలిమినెట్ చేశారు.

 

అయితే.. ప్రవస్తి దీనిపై  ఓపెన్ అయ్యారు. తాను చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ప్రాణంగా పెరిగానని.. బాలు, సుశీల, జానకమ్మ వంటి వారి పాటలు వింటూ సంగీతం నేర్చుకున్నట్లు ప్రవస్తి తెలిపారు.

 ఇక తనఎలిమినేషన్ గురించి కల్గిన ఘటనలు వీడియో రూపంలో తెలిపారు. సింగర్ సునీత కన్పించినంత  సాఫ్ట్ కాదని.. ఆమె తనను ప్రత్యేకంగా టార్గెట్ చేసిందని మాట్లాడింది. ఒక సారి మైక్ ఆఫ్ చేయకుండానే.. జడ్జీలతో నెగెటివ్ గా మాట్లాడిందన్నారు. కీరవణి, చంద్రబోస్,సునీతలు వాళ్లు పాటలు పాడిన కంటెస్ట్ంట్ లకు మంచి మార్కులు వేస్తారని చెప్పింది.

Read more: Samantha: భార్యలకు రోగాలు వస్తే.. భర్తలు డైవర్స్ ఇస్తున్నారు.. చైతూకు మళ్లీ ఇచ్చిపడేసిన సమంత..!.  నెట్టింట దుమారం..  

అంతే కాకుండా.. పాటలు పాడేకంటే ముందు.. కాస్ట్యూమ్ డ్రెస్సింగ్ దగ్గర.. బొడ్డు కింద చీరలు కట్టుకొవాలని, ఎక్స్ పోజింగ్ చేయాలని కూడా మేకప్ వాళ్లు చెప్తారని కూడా ప్రవస్తి మాట్లాడింది. ఈ క్రమంలో తనకు కల్గిన  అనుభవాన్ని వీడియోలో బైటపెట్టింది. ఒక వేళ రిఫరెన్స్ లు, రికమండెషన్ లుఉంటేనే షోలకు వెళ్లాలని చెప్పింది. లేకపోతే.. అన్యాయం, మానసిక వేదన మిగులుతాయని స్పష్టం చేసింది.ఈ క్రమంలో ప్రస్తుతం ప్రవస్తి చేసిన కామెంట్స్  సోషల్ మీడియాలో దుమారంగా మారాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News