Pravasthi VS Singer Sunitha: ఇదిగో ప్రూఫ్.. సింగర్ సునీతకు మళ్లీ ఇచ్చిపడేసిన సింగర్ ప్రవస్తి.. వీడియో వైరల్..

Pravasthi Counter to Singer Sunitha: సింగర్ ప్రవస్తి వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది. తనను కావాలని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారని కూడా ప్రవస్తి పాడుతా తీయగా జడ్జీలపై శివాలెత్తిపోయింది. ముఖ్యంగా సింగర్ సునీతపై.. ప్రవస్తి ఒక రేంజ్ లో ఆరోపణలు గుప్పించింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 23, 2025, 02:50 PM IST
  • సునీతకు కౌంటర్ ఇచ్చిన ప్రవస్తి..
  • దయచేసి దీనికి ఆన్సర్ ఇవ్వండని ప్రశ్నలు..
Pravasthi VS Singer Sunitha: ఇదిగో ప్రూఫ్.. సింగర్ సునీతకు మళ్లీ ఇచ్చిపడేసిన సింగర్ ప్రవస్తి.. వీడియో వైరల్..

Singer pravasthi Strong counter to singer Sunitha:  ఇటీవల పాడుతా తీయగా ప్రొగ్రామ్ లో సెలక్షన్స్ నిర్వహించారు. అయితే.. దీనిలో సింగర్ ప్రవస్తి కూడా పాల్గొంది. కొన్ని రౌండ్ లలో నెగ్గుకొచ్చిన కూడా..  అనూహ్యంగా చివరకు ఎలిమినెట్ అయ్యింది.  అయితే.. ప్రవస్తి మాత్రం.. తనపై జడ్జీలు కావాలని పగతో ఎలిమినేట్ చేశారని ఆరోపణలు చేసింది. పాడుతా తీయగాలో ముగ్గురు జడ్జీలపై తీవ్రమైన ఆరోపణలు చేసింది.

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా కీరవాణి, సునీత, చంద్రబోస్ పై ప్రవస్తి ఆరోపణలు చేసింది. వాళ్ల పాటలు పాడిన వాళ్లకు ఎక్కువగా మార్కులు వేస్తారని ఆరోపించింది. అదే విధంగా ఈ షోలో.. ఎక్స్ పోజింగ్, బొడ్డు కింద చీరకట్టాలని కూడా అక్కడి వాళ్లు చెప్తుంటారని ప్రవస్తి చెప్పింది. ఈ క్రమంలో ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత క్లారిటీ ఇచ్చింది. ఆమెను చిన్పప్పటి నుంచి ఒళ్లో కూర్చొబెట్టి ప్రేమ చేశానని.. కానీ ఇప్పుడు ఆమె పాటలో లోపాలు చెబితే ఆమె భరించలేక పోయిందన్నారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @pravasthi_aaradhya

ఎలిమినేట్ తర్వాత.. ఆమె తల్లి. . నా దగ్గరకు వచ్చి నోటీకొచ్చినట్లు తిట్టిందని.. జడ్జీల పిల్లలు అందర్ని బూతులు తిట్టిందని సింగర్ సునీత చెప్పింది. తమకు అందరు ఒకటే అని.. ఎవర్నీ ఎక్కువ, తక్కువ చూడమని సింగర్ సునీత మాట్లాడింది.

 ప్రవస్తికి.. తన లోపాల్ని రిసీవ్ చేసుకోలేకపోతుందని సునీత కౌంటర్ ఇచ్చింది. అయితే.. సింగర్ సునీత కౌంటర్ కు... ప్రవస్తి మరో వీడియో రీలీజ్ చేసింది. ఇప్పుడు తనను ఒళ్లొ పెట్టుకుని చూడాలని చెప్పట్లేదని మాట్లాడింది. మీరు రిలీజ్ చేసిన వీడియోలో.. నాతో మాట్లాడినట్టు.. నాతో అంతే ప్రేమగా, ఒపిగ్గా మాట్లాడారా..అని గట్టిగానే ప్రశ్నించింది.

అదే విధంగా.. వీడియో రైట్స్ పై  మాట్లాడుతూ.. నేను సెలక్ట్ చేసుకున్న సాంగ్ ను రిజెక్ట్ చేశారని చెప్పుకొచ్చింది. రాఘవేంద్రరావుగారి స్పెషల్ ఎపిసోడ్‌లో భాగంగా.. ఆయన సినిమాల్లోని భక్తి పాటల్లో నేను సాంగ్ సెలెక్ట్ చేసుకుని ప్రొడక్షన్ వాళ్లకి పంపిస్తే.. ఇది ఇవ్వడం కుదరదని చెప్పారు. కానీ.. వేరే  కంటెస్టెంట్‌తో అదే సాంగ్ పాడించారు.అదే విధంగా.. లిరిక్స్ మర్చిపోయినా కూడా ఏమనలేదు.  

Read more: Pahalgam Terror Attack: ఉగ్రదాడి నుంచి బైటపడ్డ సెలబ్రిటీ జంట.. ఆ పోస్ట్‌పై రగిలిపోతున్న నెటిజన్లు..  

పక్క నుంచి సైగలు కూడా చేశారని చెప్పింది. ఇది పక్షపాతం చూపించడం కాదా.. అంటూ సునీతకు కౌంటర్ ఇచ్చింది. ఇళయరాజా సార్.. ఎస్పీ బాలు సార్ ఎపిసోడ్‌లో మీరొక పాటకి షోలో లేకున్న కూడా జడ్జిమెంట్ ఇచ్చారని గుర్తు చేసింది. లిరిక్స్ మర్చిపోయిన.. చేతుల మీద రాసుకుని వచ్చి పాడుతుంటే కామెడీగా చూశారు.  మరీ అప్పుడు అది కాంపిటేషన్ అని గుర్తుకు రాలేదా..అని సింగర్ సునీతకు .. ప్రవస్తి గట్టిగానే ఇచ్చిపడేసింది. దండం పెట్టి మరీ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రవస్తి.. సునీతను కోరింది.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News