)
Singer Rahul sipligunj and Harinya reddy latest pics: ఫెమస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచ్ లర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి తొందరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్,తన ప్రియురాలు హరిణ్యతో ఎంగెజ్ మెంట్ వేడుక జరుపుకున్న విషయం తెలిసిందే. కొంత మంది దగ్గరి బంధువులు, ఫ్రెండ్స్ మధ్య ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.
అయితే.. ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి. తన ఇంట్లో తనకు కాబోయే భార్యతో హల్దీ వేడుకను రాహుల్ ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నాడు. ఈ పెళ్లి పనుల్లో రాహుల్ సిప్లిగంజ్, హరిణ్యను ముద్దులు పెట్టుకొవడం, ఆమె జడను లాగడం వంటి చిలిపి పనులు చేశాడు. అంతే కాకుండా కాబోయే జంట కూడా ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేశారు.
అతిథులు, స్నేహితులుకూడా పెళ్లి పనుల్లో పాల్గొన్నారు. లగ్నపత్రిక కార్యక్రమం జరిగినట్లు రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్ స్టా ఖాతాలో ఫోటోలను అభిమానుతో పంచుకున్నారు. దీంతో అభిమానులు కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
మరోవైపు.. రాజమౌళి దర్శకత్వంలోని ఆర్ఆర్ఆర్ సినిమాలో “నాటు నాటు” పాటతో ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో, రాహుల్ సిప్లిగంజ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.
ఆస్కార్ వేదికపై పాట పాడి దేశం గర్వించేటట్లు చేసిన రాహుల్‌ను 2023లో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సత్కరించి రూ.10 లక్షల ప్రోత్సాహకం అందించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్‌కు రూ.1 కోటి రూపాయల బహుమతి చెక్కును అందజేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి