Singer Sunitha: సింగర్ సునీతకు ఘోర అవమానం..మ్యూజిక్ డైరెక్టర్ భార్య తిట్టిందని రాత్రంతా వెక్కివెక్కి ఏడ్చింది!

Singer Sunitha Latest News: సింగర్ సునీత గురించి సినిమా ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఆమె తరచూ వార్తల్లో నిలూస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ సునీత తన కెరీర్‌లో జరిగిన ఓ సంఘటన గురించి ఇంటర్వ్యూలో పంచుకుంది.

Written by - Harish Darla | Last Updated : Nov 8, 2025, 08:31 AM IST
Singer Sunitha: సింగర్ సునీతకు ఘోర అవమానం..మ్యూజిక్ డైరెక్టర్ భార్య తిట్టిందని రాత్రంతా వెక్కివెక్కి ఏడ్చింది!

Singer Sunitha Latest News: సింగర్ సునీత గురించి సినిమా ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఆమె తరచూ వార్తల్లో నిలూస్తూనే ఉంటుంది. కొన్నేళ్ల క్రితం ఆమె రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె గురించి మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సింగర్ సునీత కొన్ని పాటల పోటీల కార్యక్రమాలకు జడ్జ్‌గా వెళ్తుండగా.. మరికొన్ని సినిమాల్లో పాటలు పాడుతుంది. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ సునీత తన కెరీర్‌లో జరిగిన ఓ సంఘటన గురించి ఇంటర్వ్యూలో పంచుకుంది.

Add Zee News as a Preferred Source

గతంలో తనతో ఓ సంగీత దర్శకుడు విచిత్రంగా ప్రవర్తించినట్లు సింగర్ సునీత చెప్పకొచ్చింది. ఓ కార్యక్రమంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ప్రేక్షకులతో షేర్ చేసుకుంది. ఓ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ భార్య తనతో అసభ్యంగా వ్యవహరించినట్లు సునీత చెప్పింది. ఆ కారణంగా రాత్రంతా వెక్కివెక్కి ఏడ్చినట్లు ఆమె వెల్లడించింది. అయితే తన కెరీర్‌లో అదే పెద్ద చేదు అనుభవం అంటూ సునీత భావోద్వేగానికి లోనయ్యింది. 

Also Read: Gold Mining: అత్యంత స్వచ్ఛమైన బంగారం ఎక్కడ అమ్ముతారో తెలుసా? అందుకే దీనికి అంత డిమాండ్!

"నేను ఓ పాట పాడటానికి ఫేమస్ సంగీత దర్శకుడు ఒకరి స్టూడియోకి వెళ్లాను. అక్కడ అనుకోని సంఘటన ఒకటి జరిగింది. అక్కడి వెళ్లాక ఆ మ్యూజిక్ డైరెక్టర్ తన దగ్గర ఉన్న మైక్‌ను ఇచ్చి పాట పాడమని చెప్పాడు. చెప్పగానే అక్కడికి వెళ్లాను. అక్కడికి వెళ్లి పాట పాడి.. మైక్ అక్కడ పెట్టి తిరిగి వస్తున్న క్రమంలో ఆ మ్యూజిక్ డైరెక్టర్ భార్య ఎంతో అసహ్యంగా మాట్లాడింది. నాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది" అంటూ సింగర్ సునీత తన చేదు అనుభవాన్ని పంచుకుంది. 

"అలాగే ఆ పరిస్థితుల్లో మ్యూజిక్ డైరెక్టర్ మైక్ ఇచ్చిన పాట పాడమని చెప్పిన సందర్భంగా.. ఆమె మైక్ తీసుకునేప్పుడు అతని చేయి తాకినట్లు సంగీత దర్శకుడి భార్య ఆరోపించింది. 'మా ఆయన చేతి వేళ్లను తాకుతావేంటి నువ్వు..! అసలు ఏమనుకుంటున్నావు..నీ ఉద్దేశం ఏంటి' అని ఆమె అసభ్యంగా మాట్లాడింది. దీంతో అదే సమయంలో నేను కూడా దీటుగా సమాధానం చెప్పాను. అయినా ఆమె వ్యాఖ్యలు నన్ను బాధించాయి. అందుకే ఇంటికి వెళ్లాక రాత్రంతా వెక్కివెక్కి ఏడ్చాను" అని సింగర్ సునీత భావోద్వేగానికి లోనయ్యాను అని చెప్పకొచ్చింది.

Also REad: Saturn Transit: శనిదేవుని అనుగ్రహంతో ఈ రాశుల వారు విదేశాలకు వెళ్తారు..ఉద్యోగాలు ఖాయం అవుతాయి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News