Singer Kalpana Health Update: ప్రముఖ గాయని కల్పన ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం రాత్రి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హైదరాబాద్‌లోని KPHB హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చిందని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
సింగర్ కల్పన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ సంగీత పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆమెను పరామర్శించారు. సునీత, గీతా మాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితర గాయకులు ఆసుపత్రికి చేరుకుని వైద్యుల ద్వారా ఆమె ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా నిన్న రాత్రి ఈ విషయం తెలియగానే సింగర్ సునీత..హుటాహుటిగా హాస్పిటల్ కి చేరుకున్నారు.
#Tollywood singer Sunitha and others singers reached to Holistic Hospital at Nizampet where #Singer Kalpana has been admitted..yet to know the reasons for Kalpana’s suicide..police investigation is underway.. pic.twitter.com/zRAIgEUAXn
— SHRA.1 JOURNALIST✍ (@shravanreporter) March 4, 2025
కల్పన నిద్రమాత్రలు అధికంగా మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. గత రెండు రోజులుగా ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేసి, మొదటగా కల్పన భర్త ప్రసాద్‌కు, అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆమె అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి ఆసుపత్రికి తరలించారు.
కల్పన భర్త ప్రసాద్ చెన్నైలో ఉంటుండటంతో, ఆమె హైదరాబాద్‌లో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలో ఏవైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా? భర్త చెన్నైలో ఉండగా ఆమె హైదరాబాద్‌లో ఎందుకు ఉండాల్సి వచ్చిందన్న దానిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం కల్పన ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్సకు స్పందిస్తున్న ఆమెను త్వరలోనే జనరల్ వార్డుకు తరలించే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: Samantha: 'మాజీ భర్త నాగ చైతన్యతో చేసిన ప్రతి సీన్ నాకు గుర్తుంది': హీరోయిన్ సమంత
Also Read: APPSC Age Limit: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. ఏపీపీఎస్సీ వయో పరిమితి పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









