Sunitha vs Pravasthi: ఓ టీవీ ఛానల్‌లో జరిగే పాటల పోటీపై యువ గాయనీ ప్రవస్తి పలువురు ప్రముఖులపై చేసిన సంచలన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆస్కార్ విజేతలైన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, చంద్రబోస్‌తోపాటు సీనియర్ గాయని సునీతపై ప్రవస్తి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఆరోపణలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. బాడీ షేమింగ్‌తోపాటు వస్త్రధారణ.. వివక్ష వంటివి జరుగుతున్నాయని ప్రవస్తి ఆరోపించిన విషయం తెలిసిందే. ఆరోపణల్లో గాయనీ సునీత కూడా ఉండడంతో తాజాగా వాటిపై ఆమె స్పందించారు. ప్రవస్తి చేసిన వ్యాఖ్యలపై గాయనీ సునీత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రవస్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: UPSC Final Results: యూపీఎస్సీ ఫలితాలు విడుదల.. ర్యాంకులు చెక్ చేసుకోవడం ఇలా!
ప్రవస్తి చేసిన ఆరోపణలను ఖండించిన సునీత అన్ని విషయాలు తనకు ఆపాదించుకుని ప్రవస్తి ఫీలవుతోందని పేర్కొన్నారు. 'చిన్నప్పుడు ప్రవస్తిని ముద్దు చేశా. ఈ వయసులో కూడా అలా చేస్తే బాగుండదు. ఎవరు బాగా పాడినా అందులో మునిగిపోయే భావోద్వేగానికి లోనవుతుంటాం. తాము తన్మయత్వం చెందినప్పుడు ఆ ఎపిసోడ్స్ ప్రవస్తి చూడలేదనుకుంటా' అని సునీత వివరణ ఇచ్చారు.
Also Read: Pope Francis: ఉంగరం, జీతం, అంత్యక్రియలు.. పోప్ ఫ్రాన్సిస్ టాప్ 10 రహాస్యాలు ఇవే..
'చాలా షోస్.. పోటీల్లో పాల్గొన్న ప్రవస్తికి ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదా?' అని గాయనీ సునీత ప్రశ్నించారు. కొన్ని ఛానళ్లకు కొన్ని పాటలకే హక్కులు ఉంటాయి. ప్రేక్షకులకు ఇలా అన్ని విషయాలు చెప్పు' అని ప్రవస్తికి సునీత హితవు పలికారు. అప్పుడు తాను నిజంగా సంతోషిస్తానని ప్రకటించారు. 'సంగీతం విషయంలో ఛానళ్లకు కొన్ని పరిమితులు ఉంటాయి. అన్నీ పాటలు పాడే అవకాశం ఉండదు. అనుమతించిన పాటలు మాత్రమే పోటీల్లో పాడాల్సి ఉంది' అని సునీత గుర్తుచేశారు.
వర్ధమాన గాయనీ ప్రవస్తి చేసిన ఆరోపణలు కొందరు వాస్తవమేనని చెబుతున్నారు. ప్రవస్తికి అండగా పలువురు గాయనీగాయకులు నిలుస్తున్నారు. పరిశ్రమలో ప్రతిభతోపాటు 'మరికొన్ని' కావాలని ప్రవస్తి మాదిరి ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రవస్తి కేవలం ఫేమ్.. గుర్తింపు కోసం ఇలా పరిశ్రమలోనే పెద్దలపై ఆరోపణలు చేస్తోందని మండిపడుతున్నారు. ప్రవస్తి వెనుక ఎవరో ఉన్నారని చెబుతున్నారు. ఇంకా గాయనీగా ఎదగకముందే ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు అని ప్రవస్తిపై ఇండస్ట్రీ సీనియర్ గాయనీగాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









