Sirivennela Seetharama Sastry : సిరివెన్నెల చనిపోవడానికి కారణాలివే
Lyricist Sirivennela Seetharama Sastry passes away : క్యాన్సర్ తో ఆరేళ్ల క్రితం సిరివెన్నెలకు సగం లంగ్ తీయాల్సి వచ్చిందని చెప్పారు. సిరివెన్నెలకు గతంలో బైపాస్ సర్జరీ జరిగిందని తెలిపారు. అయితే వారం క్రితం మరో లంగ్‌కు కూడా క్యాన్సర్ వచ్చిందని దీంతో సిరివెన్నెల తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులుపడడంతో చికిత్స కోసం కిమ్స్‌లో చేర్పించారని స్పష్టం చేశారు.
Sirivennela passes away KIMS MD Bhaskar Rao reveals the reason about Telugu film lyricist Sirivennela Seetharama Sastry death: గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణానికి (Sirivennela Seetharama Sastry death) గల కారణాలను కిమ్స్ ఎండీ భాస్కర్‌రావు వెల్లడించారు.
క్యాన్సర్ తో ఆరేళ్ల క్రితం సిరివెన్నెలకు సగం లంగ్ తీయాల్సి వచ్చిందని చెప్పారు. సిరివెన్నెలకు గతంలో బైపాస్ సర్జరీ (Bypass surgery) జరిగిందని తెలిపారు. అయితే వారం క్రితం మరో లంగ్‌కు కూడా క్యాన్సర్ వచ్చిందని దీంతో సిరివెన్నెల (Sirivennela) తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులుపడడంతో చికిత్స కోసం కిమ్స్‌లో (KIMS) చేర్పించారని స్పష్టం చేశారు. అయితే తాజాగా కూడా మరో వైపు ఉండే ఊపిరితిత్తుకి క్యాన్సర్ (Cancer) రావడంతో దాంట్లో కూడా సగం తీసేశారని చెప్పారు. ఆ తర్వాత రెండ్రోజులు ఆయన బాగానే ఉన్నారని తెలిపారు. ఆక్సినేషన్ సరిగా లేకపోవడంతో ఐదు రోజులుగా సిరివెన్నెల ఎక్మో మెషీన్‌పైనే ఉంచాల్సి వచ్చిందన్నారు. ఇక ఆయన కిడ్నీ కూడా దెబ్బతినడం వల్ల శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పారు. దాంతో పరిస్థితి విషమించి సిరివెన్నెల మరణించారని (Sirivennela Seetharama Sastry passes away) కిమ్స్ ఎండీ భాస్కర్‌రావు పేర్కొన్నారు.
Also Read : సిరివెన్నెలకు నచ్చిన ఆ రెండు పుస్తకాలు, కష్టమైన పాట ఏంటో తెలుసా
కాగా చెంబోలు సీతారామశాస్ర్తి 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో డాక్టర్ సీవీ యోగి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సిరివెన్నెల సీతారామశాస్త్రి పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివారు. కాకినాడలో ఇంటర్ పూర్తి చేశారు. ఆంధ్రా విశ్వకళా పరిషత్‌లో బీఏ చదివారు. పదో తరగతి అర్హతతో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం రావడంతో రాజమండ్రిలో ఆయన కొంతకాలం పని చేశారు. సిరివెన్నెల.. ఎంఏ చదువుతున్న సమయంలో దర్శకుడు కే విశ్వనాథ్ నుంచి పిలుపు రావడంతో.. సిరివెన్నెల (Sirivennela) మూవీకి మొదటిసారి ఆయన పాటలు రాశారు. అక్కడి నుంచి ఆయన జీవితం పద్మశ్రీ అందుకునే స్థాయికి వెళ్లింది. జనాల మదిలో నిలిచిపోయే ఎన్నో మధుర గీతాలను సీతారామశాస్ర్తి రాశారు. ఎన్నో అవార్డులు ఆయన్ని వరించాయి. ఆయన మొదటి పాట సిరివెన్నెలలోని...విధాత తలపునకే నంది అవార్డు దక్కించుకున్న ఘనత సిరివెన్నెల సీతారామశాస్త్రిది. 3000లకు పైగా పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela) రాశారు. పదమూడు సార్లు ఆయనకు నంది అవార్డులు వచ్చాయి.
Also Read : Sirivennela Sitaramasastri: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల ఇకలేరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook