)
Madharaasi first review:తమిళంలో ఓ మోస్తరు సినిమాలతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరో శివకార్తికేయన్. తెలుగులో ఇపుడిపుడే ఇతనికి మంచి మార్కెట్ క్రియేట్ అయింది. తాజాగా ఈయన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేసిన చిత్రం ‘మదరాసి’. శివకార్తికేయన్ డాన్, డాక్టర్, వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. లాస్ట్ ఇయర్ ‘అమరన్’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా రూ. 330 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి శివకార్తికేయన్ కెరీర్ లో బంపర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈయన టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా పేరొందిన మురుగదాస్ దర్శకత్వంలో చేసిన చిత్రం ‘మదరాసి’.
మురుగదాస్ గత కొంత కాలంగా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ ఇచ్చి చాలా కాలమే అవుతుంది. రీసెంట్ గా ఈయన దర్శకత్వంలో సల్మాన్ హీరోగా నటించిన ‘సికిందర్’ మూవీ సోదిలో లేకుండా పోయింది. తాజాగా ఈయన దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తాజాగా ఇపుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan)తో మదరాసి (Madharaasi)తో పలకరించబోతున్నారు. ఈ చిత్రం తెలుగులో రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే తెలుగులో హిట్ అనిపించుకోవాలంటే రూ. 11 కోట్లు రాబట్టాలి.
ఇక ఈ చిత్రం తమిళం, ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 90 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. అంటే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 180 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను అందుకోవాలి. మరి ఈ చిత్రం ముందున్న టార్గెట్ దృష్ట్యా ఇది చాలా పెద్ది. మరి టాక్ బాగుంటే రికవరీ పెద్ద కష్టం కాదు. మరి దర్శకుడిగా మురుగదాస్ ఈ చిత్రంతో హిట్ అందుకొని శివకార్తికేయన్ కు సాలిడ్ సక్సెస్ ను అందిస్తాడా లేదా అనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.