Peddi: పెద్ది టీజర్ లో ఈ చిన్ని చిన్ని విషయాలను గమనించారా..?

Peddi Teaser Review:  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించిన ఫస్ట్ షాట్ వీడియో విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా మార్చి 27, 2026న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈరోజు విడుదలైన టీజర్ లోని చిన్ని చిన్ని విషయాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Written by - Vishnupriya | Last Updated : Apr 6, 2025, 07:14 PM IST
Peddi: పెద్ది టీజర్ లో ఈ చిన్ని చిన్ని విషయాలను గమనించారా..?

Peddi Teaser Detailing: పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ఫస్ట్ షాట్ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఈ టీజర్ లో చిన్ని చిన్ని విషయాలు.. ఈ సినిమా కథను చెప్పకనే చెబుతున్నాయి.

Add Zee News as a Preferred Source

ఈ వీడియోలో రామ్ చరణ్ ఎంట్రీ దృశ్యం అభిమానులను ఫిదా చేస్తోంది. భుజంపై బ్యాట్, పెదవుల్లో బీడీతో క్రికెట్ మైదానంలో అడుగుపెడుతున్న చరణ్ మాస్ అప్పీల్ చూపించాడు. ముఖ్యంగా ఆయన డైలాగ్ "ఒకే పని సెసేనాకి.. ఒకే నాగ బతికేనాకి..ఇంత పెద్ద బతుకెందుకు..." అనేదీ అభిమానులకు మాస్ మీల్స్ పెట్టింది. ఈ డైలాగ్‌లో .. ఈ సినిమాలో రామ్ చరణ్ ఫాలో అయ్యే జీవన తత్వం స్పష్టంగా కనిపిస్తోంది. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని ఏదైనా చేసే కుర్రాడి క్యారెక్టర్ లో రామ్ చరణ్ కనిపించబోతున్నారు అని ఈ డైలాగ్ క్లారిటీ ఇచ్చేసింది.

ఫస్ట్ షాట్‌లో చరణ్ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. పొలాల్లో పరిగెత్తుతూ, గోని సంచి చించటం, చివరికి క్రికెట్ మైదానంలో బ్యాట్‌ను నేలపై కొట్టి బంతిని బౌండరీకి తరలించటం చిత్రంలోని పవర్‌ను తెలియజేశాయి. ఇక ఈ సినిమాలో క్రికెట్ కీలకపాత్ర పోషించనుంది అని కూడా అర్థమవుతుంది. అప్పట్లో ఒక పల్లెటూర్లో జరిగిన క్రికెట్ మాఫియా కి సంబంధించిన కథ కావచ్చు అనేది ఎంతో మంది అభిప్రాయం. 

చరణ్ గెటప్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆయన విజయనగరం యాసలో మాట్లాడిన విధానం పాత్రకు ప్రాణం పోసింది. ఈ సినిమాతో రామ్ చరణ్ తన నటి శక్తిని మరోసారి నిరూపించబోతున్నారు.

దర్శకుడు బుచ్చిబాబు చూపించిన దృక్పథం, ప్రతి సన్నివేశంలో కనిపిస్తున్న క్లారిటీ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ విజువల్స్‌ను అద్భుతంగా మలిచారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం విజువల్స్‌ను మరింత ఉత్సాహంగా మార్చింది.

గ్రామీణ నేపథ్యం కోసం వేసిన సెట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనింగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్‌లో నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి తన నైపుణ్యాన్ని చూపించారు.

ఫస్ట్ షాట్‌తోనే ప్రేక్షకుల్లో పెద్ద అంచనాలను ఏర్పరచిన ‘పెద్ది’ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ఒక స్పెషల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా మిగిలిపోతుందని భావిస్తున్నారు.

Also Read: Movie release: బీజేపీ సపోర్ట్.. విడుదలకు మాత్రం నోచుకోని సినిమా.. ఎందుకంటే..?

Also Read: Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ లో లోపించిన అక్కినేని హీరో లక్షణం.. కంప్లైంట్ చేసిన భార్య..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News