Sobhita Dhulipala Video: రెండో పెళ్లి సంబరాల్లో సమంతా.. ఆ వీడియో పోస్ట్ చేసి బిగ్ షాక్ ఇచ్చిన శోభిత ధూళిపాళ..

Sobhita naga chaitanya firest wedding anniversary video: చైతు, శోభితల మొదటి పెళ్లి వార్షికోత్సవంకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సమంత పెళ్లి సంబరాల్లో ఉండగా.. చైతు భార్య ఈ వీడియో రిలీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 4, 2025, 04:58 PM IST
  • పెళ్లి వీడియో రిలీజ్ చేసిన శొభిత..
  • నెట్టింట కొత్త రచ్చ..
Sobhita Dhulipala Video: రెండో పెళ్లి సంబరాల్లో సమంతా.. ఆ వీడియో పోస్ట్ చేసి బిగ్ షాక్ ఇచ్చిన శోభిత ధూళిపాళ..

Sobhita Dhulipala  naga chaitanya shares first wedding anniversary video: సమంతా రాజ్ నిడిమోరుల పెళ్లి ఇటీవల కోయంబత్తూరులో జరిగింది. ఈ క్రమంలో సామ్ అభిమానులు, ఫ్రెండ్స్ ప్రత్యేకంగా విషేస్ చెబుతున్నారు. అయితే.. సమంత పెళ్లి వేడుక సోషల్ మీడియాలో రచ్చగా మారింది.   ఈషా ఫౌండేషన్‌లో ఉన్న లింగ భైరవీ ఆలయంలో డిసెంబర్ 1న ఈ జంట భూత శుద్ది వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇరు కుటుంబ సభ్యులతో పాటుగా రాజ్ ఫ్రెండ్ D.K, అలాగే సమంత ఫ్రెండ్ శిల్పారెడ్డిలు అటెండ్ అయ్యారు.

Add Zee News as a Preferred Source

 

ప్రస్తుతం వీళ్ళ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే సమంతను వారి అత్తగారింట గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ఇదిలా ఉండగా.. తాజాగా..శోభిత తన పెళ్లి వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు. నాగచైతన్య, శోభితలు గతేడాది డిసెంబర్ 4న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తొలి ఏడాదిని పూర్తి చేసుకున్న నేపథ్యంలో శోభిత తన  మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శోభిత సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన వీడియోను పంచుకున్నారు. ఇప్పటివరకు ఎవరూ చూడని తమ పెళ్లి నాటి మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. ఈవీడియోలో.. చైతు, శోభితల వివాహ వేడుకలోని ఎన్నో ఘట్టాలు ఉన్నాయి.  

పెళ్లి వేడుకలోని ఎన్నో మధురానుభూతులు, కుటుంబ సభ్యుల అనురాగం ఈ వీడియోలో చూపించారు. చైతు మాట్లాడుతు.. శోభిత తన జీవితంలో వచ్చాక ఎంతో ఆనందంగా ఉన్నట్లు చెప్పాడు. అదే విధంగా శోభిత చైతు లేని జీవితంను అస్సలు ఊహించుకోలేనని ఎమోషనల్ అయ్యింది.

మొత్తంగా చైతు, శోభిత జంట ఒకరిపై మరోకరికున్న తమ ప్రేమానురాగాల్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియో క్లిప్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. అయితే.. గత కొన్ని రోజులుగా సమంత, రాజ్ నిడిమోరుల పెళ్లి హాడావుడి, వీడియోస్ , ఫోటోస్ లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Read more: Raj Nidimoru Gift: పెళ్లి తర్వాత సమంతకు ఖరీదైన బహుమతి ఇచ్చిన డైరెక్టర్ రాజ్ నిడిమోరు..హైదరాబాద్ నడిబొడ్డున అదిరిపోయే రేంజ్‌లో!

అయితే.. తాము కూడా ఎంతో ఆనందంగా ఉన్నామని, తమ మొదటి సంవత్సరం పెళ్లి వీడియోను శోభిత ప్రస్తుతం తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చిందని కొంత మంది నెట్టింట రచ్చ చేస్తున్నారు. మొత్తంగా చైతు, సమంత పెళ్లి వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.  
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News