Sodara Movie Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..!

Sodara Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగులో డిఫరెంట్ కాన్సెస్ట్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో సంపూర్ణేష్ బాబు, సంజోష్ అన్నదమ్ములా నటించిన చిత్రం ‘సోదరా’. ఈ రోజు థియేట్రికల్ గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో  చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 25, 2025, 01:35 PM IST
Sodara Movie Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ  రివ్యూ.. ఎలా ఉందంటే..!

టాలీవుడ్ లో  డిఫరెంట్ మూవీస్ తో  తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమ్ హీరో సంపూర్ణేష్ బాబు. వెరైటీ  చిత్రాలతో ఆడియన్స్ ను చక్కిలిగింతలు పెట్టే ఈయన తాజాగా సెంటిమెంట్ నేపథ్యంలో ‘సోదరా’ మూవీతో పలకరించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Add Zee News as a Preferred Source

కథ విషయానికొస్తే..

తెలంగాణలో ఓ మారుమూల పల్లెటూర్లో చిరంజీవి (సంపూర్ణేష్ బాబు), పవన్ (సంజోష్) అన్నదమ్ములు. ఇక చిరంజీవి వారసత్వంగా వచ్చిన సోడాలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఈ అన్నదమ్ములిద్దరికీ ఒకరంటే ఒకరు ప్రాణం. ఇక చిరుకు ఏజ్ పెరిగినా.. పెళ్లి కాకుండా బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. అంతేకాదు వచ్చిన సంబంధాలన్ని వచ్చినట్టే పోతుంటాయి. ఈ నేపథ్యంలో వారి ఇంటికి ఎదురుగా దివి (ఆర్తి గుప్తా) కుటుంబం దిగుతుంది. ఇద్దరూ ఆ అమ్మాయిని ప్రేమిస్తారు. కానీ చిరు.. తమ్ముడిని చదువు కోసం పట్నానికి పంపిస్తాడు. అక్కడ అతనికి మరో అమ్మాయి భువి (ప్రాచీ బన్సాల్) తో లవ్ చేస్తాడు. కాలేజీ సెలవుల కోసం ఇంటికి వచ్చిన తమ్ముడికి ఎదురింట్లో ఉండే దివి తిరస్కరించిన విషయం తెలుస్తోంది. ఆ తర్వాత తమ్ముడు రెచ్చగొట్టడంతో సంపూ.. వాళ్ల ఇంటికి వెళ్లి గొడవపడతాడు. దీంతో దివి ఫ్యామిలీ ఆ ఊరు ఖాళీ చేసి వెళ్లిపోతుంది. మరి చివరకు చిరంజీవి, దివి పెళ్లి చేసుకున్నారా.. ? మరి పవన్, భువి ప్రేమ ఫలించిందా ? లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

సంపూర్ణేష్ టాలీవుడ్ లో బర్నింగ్ స్టార్ గా తన కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా ఈయనతో తమ్ముడు సెంటిమెంట్ నేపథ్యంలో ఏకంగా ‘సోదరా’ టైటిల్ తో  సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు మన్ మోహన్ మేనంపల్లి. అంతేకాదు ఈ సినిమాలో క్యారెక్టర్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చిరంజీవి, పవన్ అని పేరు పెట్టి ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అయితే.. ఈ సినిమాలో సంపూలోని ఎమోషనల్ యాంగిల్ ను వాడుకోవాలని ట్రై చేసాడు. కామెడీని పక్కనపెట్టి సంపూతో ఇలాంటి ప్రయత్నం దర్శకుడు చేయడం సాహసమనే చెప్పాలి. మధ్యలో అన్న కోసం తమ్ముడు పడే తపన. తమ్మడు కోసం అన్న చూపించే ప్రేమతో పాటు... ఓ అమ్మాయి గురించి ఇద్దరు గొడవ పడే స్థాయి చేరడం వంటి బాగానే ఉన్నా.. సంపూ ఇమేజ్ కు ఆనలేదు. ఆయా సీన్స్ లో సంపూతో మంచి నటన రాబట్టుకొన్నా.. అతనికున్న ఇమేజ్ దృష్ట్యా ప్రేక్షకులు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.

మధ్యలో పవన్, భువి మధ్య లవ్ ట్రాక్.. ముఖ్యంగా తెలంగాణలో పల్లె అందాలను చక్కగా తెరపై ఆవిష్కరించాడు. బ్రదర్స్ ఎమోషన్స్ అక్కడక్కడ వర్కౌట్ అయిందనే చెప్పాలి. పూర్తి స్థాయిలో కాలేదు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపించేలా ఉన్నాయి. తెలంగాణ యాస మిగతా పాత్రలకు అంతగా సెట్ కాలేదు. డైరెక్టర్ ఫస్ట్ అటెంప్ట్ అయినా.. మంచి ప్రయత్నమే చేసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే..

సంపూర్ణేష్ బాబు తన మార్క్ హాస్యపు నటన కాకుండా ఎమోషన్ బ్రదర్ సెంటిమెంట్ సినిమాలో నటించడం కొత్తగా ఉంది. అక్కడక్కడ తన మార్క్ ఉండేలా ప్రయత్నం చేసాడు. తన ఇమేజ్ కు భిన్నంగా నటించడం మెచ్చుకోదగ్గ అంశం. సంపూ సోదరాగా నటించిన సంజోష్ తెలంగాణ యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్స్ నటించిన ఆర్తి గుప్తా, ప్రాచీ బన్సాల్ ఉన్నంతలో పర్వాలేదనిపించారు. గెటప్ శ్రీను అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

పంచ్ లైన్.. సెంటిమెంట్ తో మెప్పించే ‘సోదరా’..  

రేటింగ్ 2.75/5

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News