Amala Paul Christianity: హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరోయిన్..కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ పలు విజయవంతమైన సినిమాలు చేసి అభిమానులను ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించే అవకాశాలు కూడా సంపాదించింది. ముఖ్యంగా రామ్ చరణ్ తో అమలాపాల్ నటించిన నాయక్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో శుభలేఖ రాసుకున్న పాతలో కనిపించి అందరినీ మెప్పించింది ఈ భామ.
అంతేకాకుండా..'నాయకి', 'ఇడాలి', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. కానీ ఆ తర్వాత మాత్రం తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో మళ్లీ తమిళ, మలయాళ పరిశ్రమలకే పరిమితం అయిపోయింది.
కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆమె ప్రేమలో పడింది. కొచ్చిలో వైభవంగా జరిగిన వేడుకలో ఆమె జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకుంది. అంతకుముందు దర్శకుడు విజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న అమలాపాల్.. అతనితో కొన్ని విభేదాల వల్ల విడాకులు తీసుకొని.. మళ్లీ జగత్ దేశాన్ని రెండో పెళ్లి చేసుకుంది ఇక ఈ జంటకి ఇటీవల.. ఓ పండంటి కుమారుడు జన్మించాడు.
ఓనం పండుగ సందర్భంగా తన కుమారుడి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది. భర్త, కుమారుడితో కలిసి దిగిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు మరో కీలక విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ఈ హీరోయిన్... ఇటీవల అమలాపాల్ తన కొడుకుకు బాప్టిజం వేడుక నిర్వహించింది. ‘‘ప్రేమ, శాంతితో చుట్టుముట్టిన ఇలై బాప్టిజం జరుపుకుంటున్నారు’’ అంటూ పంచుకున్న ఫోటోలు ఇప్పుడిప్పుడే వైరల్ అవుతున్నాయి. బాప్టిజం అనేది క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన ప్రక్రియ. ఇందులో నీటిలో ముంచి లేదా నీటిని పోసి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరుతో ఆ వ్యక్తిని క్రైస్తవ మతంలోకి చేర్చడం జరుగుతుంది. ఇది దేవునితో సంబంధాన్ని కలిగించే ఒక ఆధ్యాత్మిక ఆచారం.
అమలాపాల్ తన కొడుకుకు ఈ ఈవెంట్.. జరిపి ఆ ఫోటోలు షేర్ చేయగా అభిమానులు కింద విషెస్ తెలుపుతున్నారు. ఆమె కొత్త ప్రయాణం శాంతితో, ఆనందంతో నిండిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా అమలాపాల్ కి సినిమాల్లో మళ్ళీ ముందులాగా అవకాశాలు వస్తాయా అని కూడా ఎదురు చూస్తున్నాడు ఆమె అభిమానులు.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఏకైక టీవీ సీరియల్ గురించి తెలుసా.. అసలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: కేవలం 5 నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చే వంటింటి చిట్కా.. అసలు మిస్ కావొద్దు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









