Dear Uma Movie Updates: టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు డియర్ ఉమ మూవీ ఈ నెల 18న ఆడియన్స్ ముందుకు రానుంది. సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా నటిస్తూ.. రచయితగా, నిర్మాతగా వ్యవహరించారు. పృథ్వీ అంబర్ హీరోగా నటించాడు. రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఈ సందర్భంగా సునయ మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమది అనంతపూర్ అని.. మోడలింగ్ రంగం నుంచి ఇండస్ట్రీకి వచ్చానని తెలిపారు. మొదట్లో సినిమాలు చేయడం ఈజీ అనుకున్నానని.. కానీ ఇప్పుడు అది అంత ఈజీ కాదని అర్థమైందన్నారు.
కరోనా సమయంలో తనకు ప్రతీ రోజూ ఓ కల వస్తుండేదని.. అది తనను వెంటాడుతున్నట్లు అనిపించేందని సునయ తెలిపారు. ఆ కలలో వచ్చిన పాయింట్ ఆధారంగా కథ రాసుకున్నానని.. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందన్నారు. ఈ సినిమాలో ముందుగా తెలుగు హీరోను ప్రయత్నించామన.. కానీ చాలా కారణాల వల్ల మిస్ అవుతూ వచ్చామన్నారు. పృథ్వీ అంబర్‌కు కథ చెప్పగానే కొత్త ప్రొడక్షన్ అని చూడకుండా ఒకే చెప్పారని అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జరిగే విషయాలను చూపించామని.. డాక్టర్స్, పేషంట్స్‌కు మధ్యలో ఉండే వ్యక్తులు సరిగా లేకపోతే ఏం జరుగుతుందో చూపిస్తామన్నారు.
కొంచె ఫిక్షనల్.. కొంచెం రియల్‌గా ఉంటుందని.. సోషల్ మెసేజ్ అని కాకుండా ఓ సొల్యూషన్‌ను కూడా చెబుతామన్నారు సునయ. తాను హీరోయిన్‌గా ఉండి నిర్మాతగానూ సినిమా చేయాలని అనుకోలేదని.. కానీ అలా చేయాల్సి వచ్చిందన్నారు. సినిమా అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువ పెరిగిందని.. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అందరినీ పెద్ద వాళ్లని తీసుకున్నామని తెలిపారు. నటీనటులు కూడా పెద్ద వాళ్లను తీసుకున్నామని.. అలా ముందుకు వెళ్లే కొద్ది బడ్జెట్ పెరిగిందన్నారు.
యాక్ట్ చేయడం సులభమని.. నిర్మాతగా ఉండటం చాలా కష్టమని చెప్పారు. ఒక్కొసారి ఎందుకు ఖర్చు పెడుతున్నామో కూడా తెలియదన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులు అలా వెళుతుంటే బాధగానే ఉంటున్నారు. సాయి రాజేష్‌తో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని.. డియర్ ఉమ కథను ఆయనకు చెబితే చాలా నచ్చిందన్నారు అని చెప్పారు. రదన్ సంగీతం సినిమాకు ప్రాణం అని.. కెమెరామెన్ రాజ్ తోట విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. ఏప్రిల్ 18న థియేటర్లలో ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలని కోరారు.
Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. అర్ధగంట పాటు అతలాకుతలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









