Sreeleela Karthik Aaryan: బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో కలిసి శ్రీలీల ఓ భారీ సినిమాకు షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గ్యాంగ్‌టక్, దార్జిలింగ్ వంటి ప్రదేశాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో ఓ పబ్లిక్ ప్లేస్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో శ్రీలీల భావోద్వేగానికి లోనయ్యేలా చేసిన ఘటన జరిగింది.
వైరల్ అయిన వీడియో ప్రకారం, కార్తిక్ ముందుగా నడుస్తూ వెళ్తుండగా, శ్రీలీల ఆయన వెనుకే నడుస్తోంది. ఇదే సమయంలో ఓ అభిమాని ఆమెను తలచుకుంటే లాగేసినట్టుగా ఆమెను బలవంతంగా జన సమూహంలోకి లాగేశాడు. ఆ హఠాత్ ఘటనతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు.
అయితే, శ్రీలీల టీమ్ స్పందన చాలా వేగంగా జరిగింది. ఆమెను తక్షణమే జనాల్లోనుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ సమయంలో శ్రీలీల కాస్త అద్దిరిపోయినట్టే కనిపించినా, ఆమె తన కూల్ నడవడిని మాత్రం కొనసాగించింది. తన టీంతో మాట్లాడుతూ చిరునవ్వులు చిందించింది. కార్తిక్ ఆర్యన్ వెనక్కి తిరిగి చూశాడు కానీ ఈ ఘటనకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగినట్లు కనిపించలేదు.
ఈ ఘటనతో సోషల్ మీడియాలో అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒకరి కంటె మరొకరు ఘాటుగా రియాక్ట్ చేస్తున్నారు. "ఇలా హీరోయిన్లను జనాల్లో లాగడం ఎంత ప్రమాదకరం?", "అభినేత్రుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలి" అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓ అభిమాని అయితే, "స్టార్ హీరోయిన్లే సేఫ్‌గా లేనప్పుడు, మామూలు ప్రజలు ఎలా సేఫ్‌గా ఉండగలరు?" అంటూ గట్టిగా ప్రశ్నించాడు.
ఇటీవల కాలంలో సెలబ్రిటీ ఈవెంట్లలో భద్రతా లోపాలు తరచూ కనిపిస్తున్నాయి. అభిమానులు తమ అభిమానాన్ని చూపించడంలో అధికంగా ముందుకు వచ్చేస్తున్నారు. కానీ, అలా చేయడం వల్ల ఆ సెలబ్రిటీకి ప్రమాదం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా షూటింగ్‌ల సమయంలో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేయడం చిత్రబృందాల బాధ్యతగా మారుతోంది.
శ్రీలీల ప్రస్తుతం సౌత్ నుంచి బాలీవుడ్ దాకా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. అద్భుతమైన నటన, డాన్సులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటువంటి అనుకోని సంఘటనలు ఆమె వంటి యువ నటీమణులకు మానసికంగా దెబ్బతీయవచ్చు. అయినా ఆమె పరిస్థితిని ఎంతో శాంతంగా ఎదుర్కొన్న తీరు ఫ్యాన్స్‌ను మెప్పించింది.
Also Read: Movie release: బీజేపీ సపోర్ట్.. విడుదలకు మాత్రం నోచుకోని సినిమా.. ఎందుకంటే..?
Also Read: Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ లో లోపించిన అక్కినేని హీరో లక్షణం.. కంప్లైంట్ చేసిన భార్య..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









