)
Sreeleela About Ravi Teja : తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు.. రవితేజ మాస్ జాతర సినిమా.. ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.
ఈ సినిమా..అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు సూర్య చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ క్రమంలో ఈ ఈవెంత్ లో శ్రీ లీల చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. "పెళ్లి సందడి విడుదలకు ముందు రవితేజ గారితో ధమాకా సినిమా చేశాను. ధమాకా తర్వాత నాకు మళ్ళీ ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది,” అని చెప్పుకొచ్చింది.
“రవితేజ గారు ఎప్పుడు కూడా చాలా.. హుషారుగా ఉంటారు. ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉండటం రవితేజ గారిని చూసి ఆ లక్షణం..నేర్చుకోవచ్చు. రవితేజ గారి అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో మాస్ జాతర అలా ఉంటుంది. భాను గారు అద్భుతంగా సినిమాని తెరకెక్కించారు. ఇంత మాస్ గా నన్ను నేను ఎప్పుడూ చూసుకోలేదు,” అని తెలిపారు.
“ఈ సినిమా షూటింగ్ సమయంలో రవితేజ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు... మీ వేడుకకు వచ్చిన సూర్య గారికి స్పెషల్ థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి, సితార బ్యానర్ కి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. మాస్ జాతర చిత్రంలో నేను పూర్తి కొత్తగా కనిపిస్తాను,” అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి