Sri Tej Health Condition: పుష్ప 2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడి ఆరోగ్యం కుదుటపడలేదు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ నరాలు దెబ్బతినడంతో ఎంత చికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కడం లేదని డాక్టర్లు తెలిపారు.చిన్నపిల్లాడు కావడంతో నరాలు దెబ్బతిన్నాయని.. చికిత్స అందిస్తున్నప్పటికి ఎలాంటి పురోగతి లేదని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతానికి బాలుడు కళ్లు మాత్రమే తెరుస్తున్నాడని.. అతను ఎవరిని గుర్తుపట్టడం లేదన్నారు. వెంటిలేటర్ పై ఉన్న శ్రీతేజకు.. ఎండోస్కోపిక్ గ్యాస్ట్రస్టమీ ప్రాసెస్ లో ఫుడ్ అందిస్తున్నామన్నారు. శరీరంలో కదలికలు వచ్చి, నర్వస్ సిస్టమ్ పనిచేసేందుకు నిత్యం ఫిజియోథెరపీ చేపిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ సినిమా నిర్మాతలు మాత్రం .. పుష్ప 2 ప్రీమియర్ కు తమ టీమ్ వచ్చే విషయాన్ని ముందుగానే పోలీసులకు న్యూస్ అందించిన విషయాన్ని ప్రస్తావించారు. ముందుగానే సమాచారం ఇచ్చాము కాబట్టే.. అంత మంది పోలీసులు థియేటర్ దగ్గర ఉన్నారన్నారు. అదే విషయాన్ని నిర్మాతల తరుపున లాయర్ తన వాదనలు వినిపించారు. పోలీసులు, ప్రభుత్వం తగిన భద్రత కల్పించని ప్రస్తావించారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
కారణం ఏదైనా తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఈ పాపంలో అందరిది భాగస్వామ్యం ఉంది. పుష్ప 2 విషయానికొస్తే.. ఈ సినిమా తమిళనాడు, కేరళ ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు. కానీ హిందీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.