Allu Arjun: తన భర్త పుష్ప అరెస్ట్‌పై శ్రీవల్లి ఆగ్రహం.. `ఎక్స్`లో నేషనల్ క్రష్ ట్వీట్ వైరల్
Rashmika Mandanna Condemns Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా స్పందిస్తూ ఘటనను ఖండించారు. పుష్ప సినిమాలో భార్య పాత్ర పోషించిన రష్మిక అరెస్ట్‌ను తప్పుబట్టారు.
Allu Arjun Bail: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ వ్యవహారం.. రోజంతా జరిగిన హైడ్రామాపై రష్మిక స్పందించారు. సినిమాలో అల్లు అర్జున్‌కు శ్రీవల్లి పేరుతో భార్య పాత్ర పోషించిన రష్మిక 'ఎక్స్' వేదికగా స్పందించారు. అరెస్ట్ వ్యవహారాన్ని రష్మిక ఖండించారు. తొక్కిసలాట ఘటనలో ఒక వ్యక్తిని నిందించడం సరికాదని హితవు పలికారు. ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట.. జైలుకు కాదు ఇంటికే! సంబరాల్లో ఫ్యాన్స్
సంధ్య థియేటర్‌లో పుష్ప విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవత్ అనే మహిళ మృతి కేసులో శుక్రవారం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. తోటి నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వార్తలు తెలుసుకున్న రష్మిక సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా 'ఎక్స్'లో సంచలన ట్వీట్ చేశారు.
Also Read: Allu Arjun: పోలీసుల అత్యుత్సాహం.. బెడ్రూమ్‌లోకి రావడంపై అల్లు అర్జున్ ఆగ్రహం
'ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నేను ఊహించలేకపోతున్నా. ఈ ఘటన దురదృష్టకరం. హృదయాన్ని కలచి వేస్తోంది. ఒకే వ్యక్తిని నిందించడం సరికాదు' అంటూ రష్మిక మందన్నా ట్వీట్ చేసింది. రష్మిక చేసిన ట్వీట్‌కు సామాజిక మాధ్యమాల్లో ఊహించని స్పందన లభిస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు రీట్వీట్ చేస్తూ.. కామెంట్లు చేస్తూ రష్మికకు మద్దతు తెలుపుతున్నారు. 'అల్లు అర్జున్‌కు మేం మద్దతు' అనే ఇంగ్లీష్ హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తోంది. కాగా మధ్యంతర బెయిల్ మంజూరు అనే విషయం తెలుసుకుని రష్మిక మందన్నా ఊరట చెందారని తెలుస్తోంది. కాగా అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఇప్పటికే సినీ ప్రముఖులు స్పందించారు. న్యాచురల్ స్టార్ నాని, హాస్య నటులు రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ, నితిన్, రామ్ గోపాల్ వర్మ తదితరులు స్పందించారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌ను బాధ్యులను చేయడం తప్పుబడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter