)
SSMB29 Shooting Update: సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో కలిసి ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తాజాగా కెన్యా దేశంలోని ఓ అడవిలో జరుగుతోంది. దీని అప్డేట్స్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. కెన్యాలోని ఓ అడవిలో సింహంతో షూట్ చేస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తుంది.
ఇటీవలే ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే అపుడప్పుడు ఈ సినిమా నుంచి కొన్ని లీక్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా హీరోయిన్ నటిస్తోంది. అయితే ఇంకో పాత్రలో దీపికా పదుకొనే నటించనున్నట్లు తెలుస్తోంది. 'బాహుబలి' లాంటి బ్లాక్బాస్టర్ సినిమా తర్వాత బాలీవుడ్ నటీమణులు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆలియా భట్, దిశా పటానీ, దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా లాంటి వాళ్లు ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా ప్రారంభం దగ్గర నుంచి అంతా గోప్యంగా ఉంచుతున్నారు దర్శకుడు రాజమౌళి. ఒక్క అప్డేట్ కూడా బయటకి ఇవ్వకుండా.. ఎలాంటి ఫొటోలు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా తరచుగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు లీక్ అవుతున్నాయి. షూటింగ్ చేసే ప్రాంతంలో ఎవరో ఒకరు తమ మొబైల్ ద్వారా వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడా లీకుల బెడద మహేష్ బాబు, రాజమౌళి చిత్రాన్ని వెంటాతున్నాయి. తాజాగా కెన్యాలో జరుగుతున్న కీలక షెడ్యూల్లో సింహంతో మహేష్ బాబు కలిసి నడుస్తున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. చేతిలో పెద్ద కర్ర పట్టుకొని అతను నడుస్తున్న విజువల్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.
#MaheshBabu #SSRajamouli #SSMB29 pic.twitter.com/pTyrJEGIGg
— Mr Palanhaar (@PowerfulReviews) September 6, 2025
SSMB29 సినిమా కోసం మహేష్ బాబు నిజమైన సింహంతో శిక్షణ తీసుకుంటున్నాడని చెబుతున్నారు. ఇది సెట్ సీన్ కాదని కొందరు అంటున్నారు. కానీ ఈ వీడియోకి ఈ సినిమాకి ఏదో సంబంధం ఉండాలి. కొందరు ఇది AI వీడియోనా అని అడుగుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో చర్చను సృష్టిస్తోంది. దీని గురించి స్పష్టత రాలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook