)
Star Actress Physical Harassment : తెలుగు.. కన్నడ సీరియల్స్‌లో నటిస్తున్న ఒక ప్రముఖ నటి గత కొన్ని నెలలుగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. నవీన్ అనే వ్యక్తి మొదట ఫేస్బుక్లో ఆ నటి కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. కానీ ఆ నటి దానిని పట్టించుకోలేదు. అయినా కూడా నవీన్ మెసెంజర్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు..వీడియోలు పంపడం ప్రారంభించాడు. ఈ వ్యవహారం మూడు నెలలుగా కొనసాగుతూనే ఉంది. నటి అతనిని హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.
చివరికి ఈ నెల 1వ తేదీన నటి వ్యక్తిగతంగా కలసి మరోసారి హెచ్చరించినప్పటికీ, వేధింపులు ఆగకపోవడంతో ఆమె నేరుగా పోలీసులను సంప్రదించింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు నవీన్‌ను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుచేసిన తర్వాత అతనిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవీన్ పలు నకిలీ అకౌంట్లు సృష్టించి ఆ నటిని నిరంతరం వేధించేవాడని చెప్పారు. ఫేస్బుక్లో అసభ్య వీడియోలు పంపడం, పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మహిళలను అప్రమత్తంగా ఉండమని, ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook