Niharika Konidela: హీరోయిన్ నిహారికతో దర్శకుడు రాఘవేంద్ర రావు అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్‌

K Raghavendra Rao Indecent behavior With Niharika Konidela She Discomfort: సినీ పరిశ్రమలో సూపర్‌ హిట్‌ సినిమాలు చేసిన దర్శకుడు కె రాఘవేంద్ర రావు వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మెగా డాటర్‌ నిహారిక కొణిదెల నడుముపై చేయి వేశారని.. ఆమె కొంత ఇబ్బందికి గురయ్యారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 12, 2025, 07:24 PM IST
Niharika Konidela: హీరోయిన్ నిహారికతో దర్శకుడు రాఘవేంద్ర రావు అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్‌

  K Raghavendra Rao Video Viral: తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన సినిమాలు చేసి సూపర్‌ హిట్‌ విజయాలు పొందిన దర్శకుడు కె రాఘవేంద్ర రావు. మాస్‌.. క్లాస్‌ ఇలా అన్ని సినిమాలు చేసి దర్శకేంద్రుడిగా గుర్తింపు పొందారు. శృంగార రసానికి సినిమాలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చి సినిమాలకు మరింత మసాలా అందించే దర్శకుడు రాఘవేంద్ర రావు. అలాంటి సీనియర్‌ దర్శకుడు రాఘవేంద్ర రావు సరికొత్తగా వివాదంలో చిక్కుకున్నాడు. ఓ హీరోయిన్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ప్రచారం వైరల్‌గా మారింది.

Add Zee News as a Preferred Source

Also Read: Ration Cards: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్! రేషన్‌ కార్డులు ఈ కేవైసీ చేసుకున్నారా?

ఓ సినిమా ఈవెంట్‌లో దర్శకుడు కె రాఘవేంద్ర రావు, నాగబాబు కుమార్తె, హీరోయిన్‌ కొణిదెల నిహారిక పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌లో రాఘవేంద్ర రావు కుర్చీలో కూర్చొని ఉండగా పలకరించేందుకు నిహారిక వచ్చింది. మెగా కుటుంబానికి రాఘవేంద్ర రావుకు మంచి అనుబంధం ఉంది. ఆ చనువుతో దర్శకుడిని కలిసి నిహారిక మాట్లాడుతూ ఉంది. సరదాగా మాట్లాడుతున్న సమయంలోనే రాఘవేంద్ర రావు నిహారిక నడుముపై చేయి వేశాడు. ఆ వీడియోను స్వయంగా నిహారిక పంచుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఒకసారి చేయి వేస్తే వదిలించుకునే ప్రయత్నం చేయగా.. మళ్లీ రాఘవేంద్ర రావు అలానే వేయడం విస్మయానికి గురి చేస్తోంది.

Also Read: Schools Close: ఈ వారంలో 4 రోజులు స్కూళ్లకు సెలవు.. ఎక్కడ? ఎప్పుడు?

నవ్వుతూనే రాఘవేంద్ర రావు నడుముపై చేయి వేయడంతో నిహారిక గమనించింది. అయితే పెద్దాయన అని ఏమనలేదు. చేయి వేయడంతో ఇబ్బంది పడిన నిహారిక సుతిమెత్తంగా రాఘవేంద్ర రావు చేయిని వదిలించుకుంది. రెండు సార్లు అలా చేయగా.. రాఘవేంద్ర రావు మళ్లీ వేసే ప్రయత్నం చేయడంతో వెంటనే నిహారిక కుర్చీ వెనక్కు వెళ్లింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: Delhi Blast Shock: బాంబు పేలుళ్లపై భారతదేశం దిగ్భ్రాంతి.. మోదీ, కేసీఆర్‌, జగన్‌ తదితరుల సంతాపం

వైరల్ వీడియో చూడండి...

 
 
 
 
 
 

మనవరాలి వయసు కలిగిన నిహారిక నడుముపై రాఘవేంద్ర రావు చేయి వేయడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ముసలాయనకు ఇదేం బుద్ధి అని ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో మహిళలను అసభ్యంగా చూపించే రాఘవేంద్ర రావు బయట కూడా అలాగే ప్రవర్తిస్తారా? అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇలా ప్రవర్తించడం తప్పవని రాఘవేంద్ర రావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శృంగారం అంటే పడిచచ్చే రాఘవేంద్ర రావు ఇలా చేయకుంటే ఇంకెలా చేస్తారని మరికొందరు పేర్కొంటున్నారు. గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌ అనేవి కొన్ని ఉంటాయి.. వాటిలో రాఘవేంద్ర రావు బ్యాడ్‌ టచ్‌ చేశాడని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News