Star Hero Daughter: అది పెంచుకుంటే మాత్రమే అవకాశాలు ఇస్తాం అన్నారు.. తెలుగు స్టార్ హీరో కూతురు షాకింగ్ వ్యాఖ్యలు..

Star Heroine: స్టార్ హీరో కూతురు ప్రస్తుతం చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. తనకు కేవలం ఒకటి లేకపోవడం వల్లే.. ఎన్నో సినిమాలలో అవకాశాలు కోల్పోయానని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, ఏమి చెప్పింది అనే విషయానికి వెళితే..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 21, 2025, 05:46 PM IST
Star Hero Daughter: అది పెంచుకుంటే మాత్రమే అవకాశాలు ఇస్తాం అన్నారు.. తెలుగు స్టార్ హీరో కూతురు షాకింగ్ వ్యాఖ్యలు..

Shivathmika Comments on Film Industry
టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. హీరో కూతురైనా తనను సినిమాల్లో నుంచి తీసేశారు అనే విషయాన్ని ఆమె ఓపెన్‌గా చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది.

అనుకున్న దానికంటే భిన్నంగా ఇండస్ట్రీ
‘దొరసాని’ సినిమాతో తెరంగేట్రం చేసిన శివాత్మిక, మొదట్లో తల్లిదండ్రులు ఇండస్ట్రీకి చెందిన వారు కావడంతో అవకాశాలు సులభంగా వస్తాయని భావించింది. కానీ కొన్ని నెలల్లోనే వాస్తవాలు గ్రహించానని, అసలు టాలెంట్‌తో పాటు మార్కెట్ వాల్యూను కూడా పరిశీలిస్తారని చెప్పారు.

తనకూ, ఇతర స్టార్ కిడ్స్‌కూ అవకాశాల కోసం పోరాడాల్సి వస్తోందని శివాత్మిక పేర్కొన్నారు. కొన్ని ప్రాజెక్టులకు ఒప్పుకున్నాక చివరిలో తనను తీసివేశారట. అయితే దానికి కారణం సోషల్ మీడియా ఫాలోయింగ్ లేకపోవడం అని చెప్పకు వచ్చింది. మంచి నటనకంటే సోషల్ మీడియాలో ఫేమ్‌కు ఇంత ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితులు ఆమెను నిరాశపర్చాయంటూ పేర్కొన్నారు.

తాను నటిని, కంటెంట్ క్రియేటర్ కాదని స్పష్టం
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెంచుకోమని చాలా మంది సూచిస్తున్నారని, ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచుకోకపోతే అవకాశాలు రావు అని కూడా చెప్పారు అని చెప్పుకొచ్చింది. ఈ మధ్య కాలంలో వైష్ణవి చైతన్య, నిహారిక ఎన్ఎమ్ వంటి సోషల్ మీడియా..ఇన్‌ఫ్లూయెన్సర్లు అవకాశాలు దక్కించుకుంటున్నారన్న.. విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.

తన ప్రయత్నం కొనసాగుతుందన్న విశ్వాసం
తనకు నటనపై విశ్వాసం ఉందని, భవిష్యత్‌లో మంచి అవకాశాలు రావొచ్చన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నానని శివాత్మిక తెలిపారు. ఈమె మాటలు ఇండస్ట్రీలోని నెపోటిజం, సోషల్ మీడియా ప్రభావంపై మళ్లీ చర్చలు మొదలయ్యేలా చేశాయి.

ఇక దొరసాని సినిమాతో హీరోయిన్గా పరిచయమైన శివాత్మిక రాజశేఖర్ ఆ తర్వాత కొన్ని చిత్రాలలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ..చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. శివాత్మిక రాజశేఖర్ నటనకు కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది.  అయినప్పటికీ ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక ఇలా అవకాశాలు రాకపోవడానికి కారణం సోషల్ మీడియాలో ఫాలోవర్స్ లేకపోవడమే అని ఈ హీరోయిన్ చెప్పడంతో.. అది కాస్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Also Read : అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..

Also Read : ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే ఏకైక శాండల్‌వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News