Tollywood : తిరుమలకు కాలినడకన స్టార్ హీరో, హీరోయిన్.. కెమెరాకు దొరికేశారుగా..!

Star Hero: హీరో హీరోయిన్లు ఎంతోమంది తమ సినిమా విడుదలకు ముందు తిరుమల కు వెళ్తారు అన్న సంగతి తెలిసిందే. తమ సినిమా విజయం సాధించాలని వీరందరూ ఆ వెంకన్న స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ క్రమం..లో ఇప్పుడు తెలుగు స్టార్ హీరో, హీరోయిన్.. కొండ మెట్లు ఎక్కుతూ మీడియా.. కళ్ళకి దొరికారు.  

Written by - Vishnupriya | Last Updated : Apr 27, 2025, 01:39 PM IST
Tollywood : తిరుమలకు కాలినడకన స్టార్ హీరో, హీరోయిన్.. కెమెరాకు దొరికేశారుగా..!

Nani and Srinidhi Shetty : వేసవి సెలవులు ప్రారంభమవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో నిండి పోతున్నది. ఈ సందర్బంగా టాలీవుడ్ ప్రముఖులు.. కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. తాజాగా, ప్రముఖ నటుడు నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కలసి కాలినడకన తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. 

Add Zee News as a Preferred Source

రాబోయే హిట్ 3 సినిమా విజయం కోసం స్వామివారిని ప్రార్థిస్తూ, ఏప్రిల్ 27, 2025 ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. భక్తుల మధ్యనే సాదాసీదాగా మాస్కులు, కర్చీఫ్‌లు ధరించి మెట్ల మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఈ సెలబ్రిటీలను గుర్తించి ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

 

హిట్ 3 సినిమాకు సంబంధించి వివరాల్లోకి వెళితే, ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని ఇందులో అర్జున్ సర్కార్ పాత్రలో నటించగా, రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్, అదిల్ పాలా, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లు, ట్రైలర్‌లు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. 

హిట్ 3 సినిమా మే 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. మేడే కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమా, నానికి మరో బిగ్ సక్సెస్ అందించనుందని అభిమానులు ఆశిస్తున్నారు. 

తిరుమల శ్రీవారి దివ్య దర్శనం తీసుకుని, హిట్ 3 మూవీ టీమ్ తిరిగి విజయ రథాన్ని ఎక్కుతుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత నాని పారడైజ్ అనే చిత్రంలో కూడా కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇప్పటికే అందరిలోనూ ఆసక్తిని నెలకొల్పింది.. రెండు జడలు వేసుకొని నాని చాలా డిఫరెంట్ గా కనిపించారు. అంతేకాదు నాని హాయ్ నాన్న చిత్రం తరువాత దాదాపు అన్ని మాస్ చిత్రాలే ఎంచుకోవడంతో.. నాని త్వరలో క్లాస్ సినిమాలో కనిపించడేమో అని.. ఆయన అభిమానులు కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి నాని భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్టులు ఎంచుకుంటారో వేచి చూడాలి.

Also Read: AP Bars: మందుబాబుకు జాక్‌పాట్‌.. భారీగా ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం

Also Read: Anant Ambani: కొత్త జీవితంలోకి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News