Star Hero To Enter Pushpa 3: టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా గుర్తింపు పొందిన మైత్రీ మూవీ మేకర్స్..ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో ఆగిపోకుండా..మొత్తం పుష్ప ఫ్రాంచైజ్ చుట్టూ ఒక పెద్ద సినిమాటిక్ యూనివర్స్‌ను ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పుష్ప సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో.. ఈ పుష్ప ప్రపంచాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారంట. ఇందులో కొత్త కథలు..బలమైన పాత్రలు..వేర్వేరు కోణాలు చూపించాలనే ఆలోచన ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా.. పుష్ప 3 సినిమా చాలా నిశ్శబ్దంగా ప్రీ-ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. కథ, స్క్రీన్‌ప్లే విషయంలో ఎలాంటి తొందర లేకుండా పూర్తి స్థాయిలో వర్క్ చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేసి..అక్కడ కథా చర్చలు, స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు టాక్. మూడో భాగం మరింత బలంగా.. ప్రభావవంతంగా ఉండాలనే లక్ష్యంతో టీమ్ చాలా జాగ్రత్తగా ముందుకెళ్తోంది.
ఈ భాగంలో పుష్పరాజ్ తిరిగి తన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని తిరిగి దక్కించుకునే కథను చూపించనున్నారని అంచనా. ఈ పాత్రలో మళ్లీ అల్లు అర్జున్ కనిపించనుండగా..దర్శకత్వ బాధ్యతలు మరోసారి సుకుమార్ తీసుకుంటున్నారు. అలాగే ఈ సినిమాలో ఓ భారీ స్టార్ నటుడు ప్రధాన విలన్‌గా.. కనిపిస్తాడనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఫ్యాన్స్‌ను ఎక్కువగా ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏమిటంటే..బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పేరు ఈ ప్రాజెక్ట్‌తో వినిపించడం. ఆయనను సుల్తాన్ అనే.. శక్తివంతమైన పాత్రలో పరిచయం చేయాలనే.. ఆలోచన ఉందని సమాచారం. ఈ పాత్ర ఒక బిలియనీర్ మాస్టర్‌మైండ్‌గా.. పెద్ద బిజినెస్ గాడ్‌ఫాదర్‌గా ఉంటుందట. మొదట కేమియో పాత్రగా మొదలై.. తరువాత ఆ పాత్రతోనే ఒక ప్రత్యేక సినిమా వచ్చే అవకాశం కూడా ఉందని టాక్. ఇది నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద క్రాస్‌ఓవర్‌గా నిలుస్తుంది.
అయితే పుష్ప 3 సినిమా సెట్స్‌పైకి రావడానికి ఇంకా చాలా సమయం పడనుంది. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్మీ.. రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. అలాగే అల్లు అర్జున్ కూడా ఇతర పెద్ద దర్శకులతో సినిమాలు చేయడంలో బిజీగా ఉన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే..పుష్ప 3 సినిమా 2028లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









