Balakrishna: అన్‌స్టాపబుల్ లో బాలకృష్ణని విసిగించిన స్టార్ హీరో..అంతలా ఎవరు విసిగించలేదంట..!

Balakrishna About Pawan Kalyan  బాలకృష్ణ హోస్టుగా వచ్చిన అన్ స్టాపబుల్ షో ఇప్పటికే ఎన్నో సీజన్లు ముగించుకొని సక్సెస్ సాధించింది. ఈ క్రమంలో హైలెట్గా నిలిచిన ఎపిసోడ్స్ లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఒకటి. కానీ ఈ ఎపిసోడ్ గురించి మరొక ఎపిసోడ్లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరిచాయి.. 

Written by - Vishnupriya | Last Updated : Mar 8, 2025, 03:30 PM IST
Balakrishna: అన్‌స్టాపబుల్ లో బాలకృష్ణని విసిగించిన స్టార్ హీరో..అంతలా ఎవరు విసిగించలేదంట..!

Balakrishna Pawan Kalyan Unstoppable With NBK:

Add Zee News as a Preferred Source

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షోలో.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హాజరైన ఎపిసోడ్‌పై ఇప్పటికీ చర్చ జరుగుతోంది. ఈ షోలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సంభాషణ అభిమానులను అలరించింది. అయితే ఆ తర్వాత బాలకృష్ణ ఈ ఎపిసోడ్ కి సంబంధించి చేసిన కొన్ని ఇన్ డైరెక్ట్ వ్యాఖ్యలు ఇప్పటికి వైరస్ అవుతున్నాయి.

అన్‌స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఎపిసోడ్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలైనప్పుడే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఫిబ్రవరి 2, 2023న స్ట్రీమింగ్ అయిన ఈ ఎపిసోడ్ కొన్ని గంటల్లోనే రికార్డులను బ్రేక్ చేసింది.  

ఇక ఆ తర్వాత వచ్చిన ఒక ఎపిసోడ్ లో సుహాసిని, శ్రియ, హరీష్ శంకర్ బాలకృష్ణతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుహాసిని బాలకృష్ణని.. మీ షోలో మీరు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా కొంచెం విసిగించిన వారు ఎవరు అని అడగగా, ఆయన కూల్‌గా స్పందించారు. బాలయ్య మాట్లాడుతూ, "ఒక హీరో నా షోలో అస్సలు మాట్లాడలేదు, కేవలం నవ్వుతూ ఉన్నాడు. ఎంతసేపు నేనే మాట్లాడాల్సి వచ్చింది. ఇక అరగంట తర్వాత ఆ హీరో ఓపెన్ అయ్యారు. ఇక ఆ తర్వాత మనతో మామూలుగా ఉండదు కదా" అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆ హీరో ఎవరో అనే సందేహం అందరిలో కలిగింది. చివరకు హరీష్ శంకర్ ప్రశ్నించగా, "మీ వాడే" అని బాలయ్య చెప్పడంతో పవన్ కళ్యాణ్ అని స్పష్టమైంది.  

ఈ ఎపిసోడ్ ప్రసారమైన తర్వాత పవన్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. కొన్ని గంటల్లోనే ఈ ఎపిసోడ్ 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటింది. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎప్పటికీ తగ్గదని మరోసారి రుజువైంది.  

బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో ఇప్పటివరకు అనేక స్టార్ హీరోలతో ఇంటర్వ్యూలు చేసింది. ఈ షో ద్వారా ఆయన కొత్త కోణాన్ని ప్రదర్శించడంతో ప్రేక్షకుల మద్దతు లభిస్తోంది.
  

Also read: South Indian Movement: స్టాలిన్ నేతృత్వంలో దక్షిణ ఉద్యమం, కేసీఆర్, జగన్, చంద్రబాబు, రేవంత్‌లకు ఆహ్వానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్- https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News