)
Star Herione:ఈ మధ్యకాలంలో పెళ్లి అంటేనే ఒక యూజ్ అండ్ త్రో అన్నట్టుగా మారిపోయింది. మూడుముళ్ల బంధానికి విలువ లేకుండా చేస్తున్నారు కొంతమంది. కానీ మరి కొంతమంది భర్త ఎంత చిత్రహింసలు పెట్టినా.. ఎంతమందితో ఎఫైర్ కొనసాగించినా.. కట్టె కాలే వరకు తన బర్తే తనకు సర్వస్వం అంటూ నిరూపిస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు ఒక బ్యూటీ ఆమె ఎవరో కాదు నీతూ కపూర్. భర్త కారణంగా జీవితంలో ఏ మహిళా అనుభవించిన చిత్రహింసలు అనుభవించిన ఈమె.. అతడు మరణించిన తర్వాత కూడా అతడే దేవుడు అంటూ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఎప్పుడు చూద్దాం.
Star Hero Marriage :బాలీవుడ్ లో నటుడుగా పేరు సంపాదించిన రిషి కపూర్ , ఆయన భార్య నీతూ కపూర్ 1974లో నటించిన చిత్రం జేరిలా ఇన్సాన్స్. ఈ చిత్రంతోనే వీరి మధ్య పరిచయం ఏర్పడి ఆ తర్వాత ప్రేమలో పడి 1990లో వీరు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా వీరు ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఇలా అన్యోన్యంగా ఉన్న ఈ జంట...రిషి కపూర్ క్యాన్సర్ తో బాధపడుతూ 2020 ఏప్రిల్ 30వ తేదీన మరణించారు. తన భర్త మరణించిన సమయంలో కూడా నీతూ కపూర్ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది.
Star Hero Harassment :నిజానికి నీతూ కపూర్, రిషి కపూర్ ల జంట ఆన్ స్క్రీన్ పై ఎంత అందంగా కనిపించిందో.. నిజజీవితంలో మాత్రం అంతే నరకం చూసిందనే చెప్పాలి. రిషి కపూర్ ను నీతూ వివాహం చేసుకునే సమయానికి ఆమె వయసు ఇంకా టీనేజ్ మాత్రమే కావడం గమనార్హం. అతడితో పెళ్లయిన అతి తక్కువ సమయంలోనే.. అతడు ఒక డ్రింకర్, స్మోకర్ అని తెలిసింది. అయితే నీతో కపూర్ రిషి కపూర్ ను ఆ అలవాట్ల నుంచి బయటపడేయడానికి తప్పని పరిస్థితుల్లో రిషి కపూర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినా యాస్మిన్ ను అడుక్కొని మరి అతడితో మాట్లాడమని బ్రతిమలాడిందట.
Rishi Kapoor Relationships :ఇకపోతే తన భర్త ఒక డ్రింకర్ అని తెలిసాక కూడా అతన్ని వదులుకోలేక ఆమె సైలెంట్ గా అతడిని భరించింది. ఇకపోతే రిషి కపూర్ నీతో కపూర్ తో వివాహం జరిగిన తర్వాత కూడా ఆయన ఎఫైర్స్ ను కొనసాగించారు. అలా టీనా మునిం, జుహీ చావ్లా , దివ్యభారతి వంటి వారితో ఆయన ఎఫైర్ కొనసాగించారు. తన భర్త ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్ కొనసాగిస్తున్నారని తెలిసి కూడా ఆమె చివరి వరకు అతడిని దూరం చేసుకోలేకపోయింది.
Neetu Kapoor Personal Life:రిషి కపూర్ తన ప్రవర్తనతో ఇంటి వాతావరణాన్ని కూడా ఒక టాక్సిక్ గా మార్చేశారు అని సమాచారం. అంతేకాదు రిషి కపూర్ ప్రవర్తన ఇంట్లో తల్లిదండ్రులకు కూడా నచ్చలేదని అందుకే గొడవపడ్డారని ఈ విషయాన్ని రణబీర్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే. రిషి ఆఖరికి ఎలా తయారయ్యాడు అంటే తన సొంత పిల్లల ఆలోచనలను కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళ లేకపోయారు.
Neetu Kapoor Life Story:ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా రిషి ఆల్కహాల్ తీసుకుంటానని వైద్యులను బ్రతిమలాడారట. డాక్టర్స్ చెప్పిన మేరకు ప్రతిరోజు రాత్రిపూట 3 పెగ్స్ వేసే వారట. రిషి కపూర్ వల్ల నీతూ కపూర్ ఎంత నరకం అనుభవించినా.. పబ్లిక్ లో మాత్రం అతడికి అండగా నిలుస్తూ ఆయన గురించి ఒక్క నెగిటివ్ మాత్రం కూడా ఆమె మాట్లాడలేదు. ఇక అతడు చనిపోయిన తరువాతనే ఇక తన సొంత జీవితాన్ని సంతోషంగా గడపడం మొదలు పెట్టింది. అలా జీవితంలో నరకం చూసి ఇప్పుడు భర్త మరణించిన తర్వాత సంతోషకర జీవితాన్ని గడుపుతుంది నీతూ కపూర్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.