Anchor Shiva Jyothi: తెలుగు వినోద రంగంతోపాటు జర్నలిజంలో విశేష గుర్తింపు సాధించిన యాంకర్ సావిత్రక్క అలియాస్ శివజ్యోతి. ఓ న్యూస్ ఛానల్‌లో సావత్రిక్కగా రాణించిన ఆమె అనంతరం పలు ఛానల్స్‌లలో పనిచేసి ఆ తర్వాత బుల్లితెరపై మెరుస్తున్నారు. వివిధ షోలలో హల్‌చల్ చేస్తున్నారు. అలాంటి ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారనే వార్త కలకలం రేపుతోంది. ఎందుకు అంతటి ఘోర నిర్ణయం తీసుకున్నారు? దానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
Also Read: Ration Cards: కొత్త రేషన్ కార్డు వచ్చిందా? లేదా అనేది ఇలా తెలుసుకోవాలి
నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన శివజ్యోతి అలియాస్ సావిత్రక్కగా గుర్తింపు పొందారు. ఒక టీవీ కార్యక్రమంతో విశేష గుర్తింపు పొందిన శివజ్యోతి అంతకుముందు జీవితం మొత్తం కష్టాలమయంగా ఉంది. ఆమె చిన్న వయసులోనే గంగులును ప్రేమించింది. ఈ ప్రేమ కారణంగా తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నది. పదో తరగతికి వచ్చేసరికి వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. వెంటనే ముంబైలోని బంధువుల వద్దకు పంపించి అక్కడ ఉంచారు.
Also Read: Kalvakuntla Kavitha: జైలు జీవితం తర్వాత తొలిసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫుల్ హ్యాపీ
అయితే కొన్నాళ్లకు మళ్లీ స్వగ్రామం చేరిన ఆమెకు కొంత కష్టాలు తగ్గాయి. కానీ గంగులును వదిలి తాను ఉండలేనని తేల్చి చెప్పడంతో కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురయిన శివజ్యోతి వెంటనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి ఆమెను కాపాడుకున్నారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు పంపించగా అప్పుడు శివజ్యోతి కొంత కష్టాలు తొలగిపోయాయి.
హైదరాబాద్ వచ్చాక తన సోదరుడితోపాటు తన ప్రియుడు గంగులుతో ఒకే రూమ్‌లో నివసించారు. గంగులు కష్టపడి చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం పొందగా.. టెలీ కాలర్ మొదలుకుని టీవీ యాంకర్‌గా శివజ్యోతి కెరీర్ ప్రారంభించింది. ఇద్దరూ కొంత సెటిలయ్యాక నిజామాబాద్‌లోని సాయిబాబు ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం బిగ్‌బాస్ వెళ్లగా.. అనంతరం టీవీ షోలలో మెరుస్తూ ప్రేక్షకుల మధ్య సందడి చేస్తున్నారు. ప్రస్తుతం భార్యతోపాటు భర్త గంగులు కూడా వినోదం అందిస్తున్నాడు. శివజ్యోతి యూట్యూబర్‌గా రాణిస్తున్నారు. భర్తతో కలిసి సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్‌గా శివజ్యోతి జీవితం పొందుతున్నారు.
యూట్యూబ్ చానల్లో తన లవ్ స్టోరీ విషయమై శివజ్యోతి పంచుకున్న విషయాలు చూడండి 👇🏼
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి