Jatadhara Box Office Collections: గత కొన్నేళ్లుగా హీరోగా సుధీర్ బాబు సరైన సక్సెస్ అందుకోలేదు. తాజాగా ఈయన వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో చేసిన ‘జటాధర’ మూవీకి ఆడియన్స్ నుంచి ఓ మోస్తరు రెస్పాన్స్ తో డీసెంట్ వసూళ్లను రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫస్ట్ వీకెండ్ లోనే దాదాపు రూ. 4.62 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం నాల్గో రోజుతో కలిపి రూ. 5.2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్ట చిత్ర వర్గాలు తెలిపాయి. కమర్షియల్ హార్రర్ చిత్రాలకు డేవోషనల్ టచ్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
‘ప్రేమకథా చిత్రం’ తర్వాత సుధీర్ బాబు హీరోగా నటించిన హార్రర్ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్ అంచనాలు అందుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ తో మంచి వసూళ్లను రాబడుతుంది. సుధీర్ బాబు.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఏ మాయ చేసావే’ చిత్రంతో నటుడిగా పరిచయ్యడు. ఆ తర్వాత ఎస్ఎంఎస్ ‘శివ మనసులో శృతి’ మూవీతో హీరోగా తన లక్ ను పరీక్షించుకున్నాడు.
ఆ తర్వాత ‘ప్రేమ కథా చిత్రం’తో తొలి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘దొంగాట’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, మోసగాళ్లకు మోసగాడు, భలే మంచి రోజు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కృష్ణ నటించిన ‘శ్రీశ్రీ’ సినిమాల్లో మెరిచారు. అంతేకాదు బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ‘బాఘీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ విలన్ గా అదరగొట్టాడు. డిఫరెంట్ సినిమాలతో అదరగొడుతున్న సుధీర్ బాబు.. తాజాగా ‘జటాధర’ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం డీసెంట్ వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని హిట్ అనిపించుకుంటుందా అనేది చూడాలి.
Also Read: మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..
Also Read: చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









