RK Roja Is Aunty: కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ సినీ నటి ఆర్‌కే రోజా బుల్లితెరపై ప్రత్యక్షమయ్యారు. తన పంచ్‌లు.. డ్యాన్స్‌లతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న రోజా మళ్లీ వినోద రంగం వైపు పునఃప్రవేశించారు. రాజకీయాల్లో నాయకులను గడగడలాడించే ఫైర్ బ్రాండ్ ఆర్‌కే రోజా మరోసారి బుల్లితెరపై సందడి చేస్తున్నారు. జీ తెలుగు ప్రసారం చేస్తున్న జీ జూనియర్స్ డ్రామా 8వ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్ ప్రారంభంలోనే రోజాకు యాంకర్ సుడిగాలి సుధీర్ భారీ ఝలక్ ఇచ్చాడు. షో జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా రోజాను సుధీర్ 'ఆంటీ' అని అనేశాడు. ఆంటీ అన్న తర్వాత సుధీర్ నాలుక కరుచుకున్నాడు.
Also Read: RK Roja Retirement: రాజకీయాలకు మాజీ మంత్రి రోజా గుడ్‌బై? ఎందుకో తెలుసా?
జీ జూనియర్స్ డ్రామా 8వ సీజన్ ప్రొమోలు వరుసగా విడుదల చేశారు. జూనియర్స్ డ్రామాకు జడ్జిలుగా దర్శకుడు అనిల్ రావిపూడి, ఆర్‌కే రోజా వ్యవహరిస్తున్నారు. యాంకర్ లాస్య కూడా మెరిశారు. మొత్తం ఐదు టీమ్‌లు ఈ షోలో పాల్గొంటున్నాయి. హాస్యంతోపాటు సందేశం అందించే స్కిట్స్‌తో చిన్నారులు అలరించనున్నారు. డ్రామా జూనియర్స్ 8వ సీజన్ మెగా లాంచ్ ప్రొమో విడుదల చేయగా.. ఆ ప్రొమోలు రోజా, అనిల్ రావిపూడి సందడి చేశారు. రోజా డ్యాన్స్ చేయడమే కాకుండా తన పంచ్‌లతో నవ్వులు పూయించారు. అంతేకాకుండా చిన్నారులతో కలిసి ఒక స్కిట్ కూడా చేశారు.
Also Read Ladies Hostel: లేడీస్ హాస్టల్లోకి దూరిన దొంగ.. అర్ధరాత్రి అమ్మాయిలు గగ్గోలు
చిన్నారులు చేస్తున్న స్కిట్‌కు జడ్జిగా రోజా అభిప్రాయం తెలుపుతుండగా సుడిగాలి సుధీర్ 'ఆంటీ' అనేశాడు. తాను నాలుగో తరగతి చదువుతున్నానని చెప్పి అంతకుముందే ఐదో తరగతి అని చెప్పడంతో నాలుకరుచుకున్నాడు. 'సారీ ఆంటీ' అని సుడిగాలి సుధీర్ అనేశాడు. ఈ విషయాన్ని గుర్తించకపోవడంతో పక్కనే జడ్జిగా ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి 'ఫ్లోలో మిమ్మల్ని ఆంటీ అన్నాడు' అని చెప్పడంతో రోజా సుధీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధీర్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇలా సందడి సందడిగా జీ జూనియర్స్ డ్రామా 8వ సీజన్ ప్రారంభమైంది. జూనియర్స్ డ్రామాలో చిన్నారులు తమ స్కిట్‌లతో అదరగొడుతున్నారు. పంచ్‌లతో నవ్వులు పూయిస్తూనే తమ నటనతో అబ్బుపరుస్తున్నారు. ప్రతి సీజన్‌లో జీ జూనియర్స్ డ్రామా బుల్లితెరతోపాటు వెండి తెరకు జూనియర్ నటులను పరిచయం చేస్తోంది. ఈ షో ద్వారా గుర్తింపు పొందిన చిన్నారులు సినీ పరిశ్రమలో వరుస అవకాశాలు పొందుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









