)
Suman Shetty Bigg Boss: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 జోరుగా సాగుతుంది. ఇప్పటికే ఒక వారం పూర్తయ్యి రెండో వారానికి ఈ రియాలిటీ షో చేరుకుంది. తొలివారంలో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తొలి కెప్టెన్ గా సంజన గల్రానీ అయిన సంగతి కూడా అందరికి తెలిసిందే. అయితే గురవారం రాత్రి జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో బిగ్‌బాస్ 9 రెండో వారం కెప్టెన్ గా డిమోన్ పవన్ అయ్యాడు. కెప్టెన్సీ టాస్క్ లో భరణి, మర్యాద మనీష్, ఇమ్మాన్యుయెల్లపై ఇతను గెలిచి కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యాడు.
అయితే ఈ కెప్టెన్సీ టాస్క్ కు సంచాలకురాలుగా ఉన్న రీతూ వర్మపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఈ టాస్క్ లో ఆమెకు సన్నిహితంగా ఉండే డిమోన్ పవన్ కు తగినట్లు నిర్ణయాలు తీసుకుందనే ట్రోల్స్ వస్తున్నాయి. భరణి టాస్క్ నుంచి తప్పించేందుకు ఎంతో కష్టపడిందని తెలుస్తోంది. డిమోన్ పవన్ టీ షర్ట్ కు ఎక్కువ రంగు పూస్తున్నాడనే క్రమంలో బజర్ మోగకముందే ఆమె స్టాప్ అని చెప్పడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఈ విషయంలో మాత్రం ఆమె ఫేవరిటిజం చూపిందని అంటున్నారు. ఏది ఏమైనా టాస్క్ తర్వాత ఏం జరిగిందనే విషయం మాత్రం నేడు జరగనున్న బిగ్‌బాస్ ఎపిసోడ్ లో తెలుస్తోంది.
తాజాగా విడుదలైన ప్రోమోలో కొత్తగా బిగ్‌బాస్ హౌస్ ఓనర్ అయ్యేందుకు సెలబ్రిటీలకు బిగ్‌బాస్ ఛాన్స్ ఇచ్చారు. అందుకోసం వారు టాస్క్ లో గెలవాలని అన్నారు. అయితే ఈ టాస్క్ లో భాగంగా సుమన్ శెట్టి ఇతర ఇంటి సభ్యులపై చేయి చేసుకున్నాడని బిగ్‌బాస్ పోటీదారులు ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రోమో విడుదల అయ్యింది. అయితే అందులో తన బాస్కెట్‌లోని వస్తువులను కాపాడుకునేందుకు ఇతర ఇంటిసభ్యుల నుంచి కాపాడుకోవాలి. ఆ క్రమంలో ఆ పోటీలో పాల్గొన్న వారంతా ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ గెలిచేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో రీతూ చౌదరిని కింద పడేశారు.
రీతూ చౌదరికి చెందిన వస్తువులను కింద పడేసారు. ఆ తర్వాత సుమన్ శెట్టిని టాస్క్ నుంచి తప్పించేందుకు ఇతర సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే సుమన్ శెట్టి కొందరిపై చేతులు చేసుకున్నట్లు ఇతర సభ్యులు ఆరోపించారు. అదే విధంగా అక్కడ ఉన్న సంచాలకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చేయి చేసుకుంటే టాస్క్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుదని వాళ్లు ఆరోపించారు. అంతేకాకుండా ఆ వెంటనే సుమన్ శెట్టి కొందర్ని చేతితో కొట్టినట్లు ప్రోమోలో కనిపించింది. దీంతో సుమన్ శెట్టిని టాస్క్ నుంచి డైరెక్ట్ ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది.
సుమన్ సెట్టి డైరెక్ట్ ఎలిమినేట్?
బిగ్‌బాస్ షోలో పాల్గొన్న సెలబ్రిటీలు ఇతర ఇంటి సభ్యులపై చేతులు వేస్తే ఎలిమినేట్ చేస్తారనే నిబంధన ఉంది. అయితే ఇప్పుడు సుమన్ శెట్టి ఇతర ఇంటి సభ్యులపై చేయి చేసుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చలు జరుగుతున్నాయి. ఇదే విషయమై కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కమెడియన్ సుమన్ శెట్టిని ఇంటి నుంచి ఎలిమినేట్ చేశారనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. దీనిపై స్పష్టత రావాల్సిఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook