Dear Uma Movie Trailer launch Event: తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా నటిస్తూ.. రచయితగా వ్యవహరిస్తూ.. నిర్మించిన మూవీ ‘డియర్ ఉమ’. ఈ సినిమాలో పృథ్వీ అంబర్ హీరోగా యాక్ట్ చేయగా.. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించారు. లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించగా.. రాజ్ తోట కెమెరామెన్‌గా, రదన్ సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు. ఏప్రిల్ 18న ఆడియన్స్ ముందుకు రానున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. వేర్వేరు లక్ష్యాలతో ఉన్న హీరోహీరోయిన్ కలవడం.. ఆ తరువాత ఓ ప్రమాదం జరగడం.. వైద్య రంగంలో లోపాలను చూపినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. యాక్షన్ స్వీకెన్స్, హీరోహీరోయిన్స్ మధ్య వచ్చే సీన్స్ అదిరిపోయాయి. ట్రైలర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
అనంతరం సుమయ రెడ్డి మాట్లాడుతూ .. ఓ మంచి కంటెంట్‌ను ప్రేక్షకులను అందించాలని అనుకున్నానని.. స్టోరీ రాస్తుంటే ఎంతో కంటెంట్ వచ్చేదన్నారు. కథ చెప్పగానే సంగీత దర్శకుడు రధన్ ఒప్పుకున్నారని.. తనను నమ్మి హీరోగా నటించిన పృథ్వీకి థ్యాంక్స్ చెప్పారు. తన విజయం వెనుక తన టీమ్ ఉందని.. ఏప్రిల్ 18న సినిమాను అందరూ థియేటర్లలో చూసి విజయాన్ని అందించాలని కోరారు. హీరో పృథ్వీ అంబర్ మాట్లాడుతూ.. దియా మూవీ తరువాత తెలుగులో తనకు ఫాలోయింగ్ పెరిగిందన్నారు. సుమయ ఈ సినిమాను రాస్తూ.. నిర్మించారని.. మరోవైపు హీరోయిన్‌గా నటించారని అన్నారు. ఆమె ఎంత ఒత్తిడి ఉన్నా కూల్‌గా ఉండేవారని అన్నారు. ఇది తన మొదటి తెలుగు సినిమా అవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
సంగీత దర్శకుడు రధన్ మాట్లాడుతూ.. ఈ సినిమాను సుమయ భూజానికి ఎత్తుకుని మోశారని అన్నారు. ఆమెకు సినిమాపై ఉన్న ప్యాషన్ చూసి ఈ మూవీ చేసేందుకు ముందుకు వచ్చానని చెప్పారు. దర్శకుడు ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ సినిమాను పూర్తి చేశారని.. సాంగ్స్ చాలా బాగా వచ్చాయన్నారు. కమల్ కామరాజ్ మాట్లాడుతూ .. సుమయ వల్లే డియర్ ఉమ సినిమా ఇక్కడి వరకు వచ్చిందని అన్నారు. తనకు ఈ సినిమా మంచి రోల్ ఇచ్చారని చెప్పారు.
దర్శకుడు సాయి రాజేష్ మహదేవ్ మాట్లాడుతూ .. చిన్న సినిమాలను మీడియానే జనాల్లోకి తీసుకువెళుతుందని.. ఎన్నో కష్టాలను దాటి తాము సినిమాలను తీస్తుంటామన్నారు. సుమయా వల్లే తాము అంతా ఇక్కడి వరకు వచ్చామన్నారు. అన్ని క్రాఫ్ట్‌ల మీద ఆమెకు మంచి నాలెడ్జ్ ఉందన్నారు. తమ సినిమా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
Also Read: UPI Payments: దేశమంతా నిలిచిపోయిన యూపీఐ సేవలు, చెల్లింపుల్లో అంతరాయం
Also Read: Permit Rooms: ఏపీలో మందుబాబులకు ఇకపై పుల్ జోష్, కొత్తగా పర్మిట్ రూమ్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









