Super Star Krishna as Bhagawan Shiva: సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు కృష్ణ చిన్నల్లుడు సుధీర్ బాబు అండ్ ‘జటాధర’ టీమ్. మే31 లెజెండ్రీ సూపర్‌స్టార్ కృష్ణ 82వ జయంతి. ఈ సందర్భంగా ‘జటాధర’ చిత్ర యూనిట్ ఈ ఐకానిక్ నటుడికి హృదయ పూర్వకంగా నివాళులు అర్పించింది. కృష్ణ తిరుగులేని చరిష్మా ఉంది. తెలుగు తెరకు ఎన్నో కొత్త టెక్నాలజీలను పరిచయం చేసిన ఘనత ఆయనదే. ఆయన వల్లే ఈ రోజు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఈ లెవల్లో ఉందనేది వాస్తవం. ఇక లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలను నిర్మించిన నిర్మాతగా, దర్శకుడిగా.. హీరోగా ఆయన తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు. ఆయన జయంతి సందర్భంగా ‘జటాధర’ యూనిట్ ఆయనకు ప్రత్యేకంగా నివాళులు అర్పించింది.
తెలుగు వెండితెరపై దేవుడికి, తుపానుగా,సినిమా ప్రపంచంలో శాశ్వతమైన ప్రభావితాన్ని చూపించిన శక్తిగా లెజెండీ యాక్టర్ సూపర్‌స్టార్ కృష్ణను ‘జటాధర’ చిత్రయూనిట్ స్మరించుకుంది. ఆయన అసలుసిసలు జటాధరుడి పాత్రలో ఆయనను స్మరించకోవడం విశేషం. మహా శివుడిగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులను అలరిస్తోంది.
ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘జటాధర’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా ఈ చిత్ర యూనిట్ కు ప్రత్యేకంగా నిలిచేలా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’ను తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా,శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్ర కృష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సి ఇతరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్షయ్ క్రేజీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దివ్యా విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, భవానీ గోస్వామి సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్‌గా జటాధర సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేక్షకులకు ఈ సినిమా ఓ గొప్ప అనుభూతినిచ్చేలా రూపొందుతోంది.
Also Read: NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..
Also Read: Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









