Coolie overseas business: రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ మాస్ యాక్షన్ చిత్రం ‘కూలీ’. నాగార్జున, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ వంటి దిగ్గజ హీరోలు ఈ చిత్రంలో నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కమల్ హాసన్ తో ‘విక్రమ్’ వంటి చిత్రంతో మంచి హిట్ అందించిన లోకేష్.. ఇపుడు రజినీకాంత్ తో ‘కూలీ’ వంటి యాక్షన్ చిత్రంలో ఎలా చూపించబోతున్నాడనేది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్ క్లోజ్ అయినట్టు సమాచారం. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ దాదాపు రూ. 80 కోట్లకు క్లోజ్ అయినట్టు సమాచారం. రజినీకాంత్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ బిజినెస్ అని చెప్పాలి. బాహుబలి, పుష్ప 2, ఆర్ఆర్ఆర్ తర్వాత ఓ సౌత్ చిత్రానికి ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ విదేశీ గడ్డపై జరగడం మాములు విషయం కాదు.
ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ ఫ్యాక్టర్ తో పాటు.. రజినీకాంత్ ఇమేజ్ దోహద పడిందని చెప్పాలి. ఈ సినిమా ఓవర్సీస్ లో రూ. 170 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడితే కానీ హిట్ అనిపించుకోదు. మొత్తంగా ఈ సినిమా తమిళనాడు సహా ఇతర ప్రాంతీయ భాషల్లో కలిపి రూ. 300 కోట్ల ప్రీ రిలీజ్ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలుగులో దాదాపు రూ. 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం.
మరోవైపు రజినీకాంత్ విషయానికొస్తే.. ‘జైలర్’ మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’మూవీకి సీక్వెల్ గా ‘జైలర్ 2’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఏపీకి చెందిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. అటు శివరాజ్ కుమార్, మోహన్ లాల్ తో పాటు బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
కూలీ మూవీ విషయానికొస్తే.. ఈ చిత్రం రజినీకాంత్ దేవా క్యారెక్టర్ లో కనిపించనున్నారు. నాగార్జున .. సైమన్ అనే నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర .. ‘కలేష్’ పాత్రలో కనిపించనున్నాడు. ఆమీర్ ఖాన్ ఏ పాత్రను చేసాడనేది ఆసక్తికరంగా మారింది. శృతి హాసన్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి.
Also Read : అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..
Also Read : ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే ఏకైక శాండల్‌వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









